Samantha : సమంత విడాకులపై హీరో రామ్‌ చరణ్ కీలక వ్యాఖ్యలు.. సమంత ట్వీట్ వైరల్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంత విడాకులపై హీరో రామ్‌ చరణ్ కీలక వ్యాఖ్యలు.. సమంత ట్వీట్ వైరల్!

 Authored By mallesh | The Telugu News | Updated on :28 December 2021,1:00 pm

Samantha : టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ అని పేరు తెచ్చుకున్న సమంత నాగచైతన్య తమ నాలుగేళ్ల వివాహబంధానికి ఎండ్ కార్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా సమంత నాగచైతన్య విడాకుల టాపిక్ మాత్రం సోషల్ మీడియాలో నేటికి చర్చకు దారితీస్తోంది. ప్రతీరోజు ఏదో ఒక విషయంలో నెటిజన్లు, డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వార్తలు వస్తూనే ఉన్నాయి. సాధారణంగా వివాహబంధం బలహీనమైనదని అందరికీ తెలుసిందే. ఇతర బంధాలతో పోలిస్తే దీనికి ఎమోషన్స్ అండ్ బాండింగ్ ఎక్కువ. అందుకే కాంప్రమైజ్ అయి కొందరు రిలేషన్‌లోనే కొనసాగుతుంటారు. మరికొందరు మాత్రం చట్టప్రకారం విడిపోతుంటారు.

సామ్ చై మధ్య వ్యక్తిగతంగా ఏం జరిగిందో తెలీదు.తమ పెళ్లి బంధానికి ముగింపు చెప్పి ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారిపోయారు.కానీ, సామ్ చై విడాకుల గురించి ప్రతీరోజు ఏదో ఒక వార్త హైలెట్ అవుతోంది.ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత చై జంట ఏవో మనస్పర్దల కారణంగా తమ నాలుగేళ్ల వివాహబంధానికి గుడ్ బై చెప్పారు. కానీ సామ్ మాత్రం తనకు తగిలిన గాయాన్ని తలుచుకుంటూ రోజు బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైతన్య మాత్రం తన గురించి ఏ విషయం బయటకు రానివ్వడం లేదు. సామ్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక సాడ్ పోస్టులు పెడుతోంది.

Ram charan key comments on samantha divorce

Ram charan key comments on samantha divorce

Samantha : సమంత కామెంట్స్.. సమంత ట్వీట్

 వీరిద్దరి ఎందుకు విడిపోయారో తెలియక అభిమానులు తెగ ఆవేదనకు గురవుతున్నారని టాక్..తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత విడాకుల గురించి రాంచరణ్ స్పందించారు. ఆ టైంలో పక్కనే ఎన్టీఆర్ అండ్ రాజమౌళి కూడా ఉన్నారు. సామ్ ‘కమ్ బాక్ బిగ్గర్ స్ట్రాంగ్ ’.. సమంత తనకు తగిలిన గాయాలను తట్టుకుని మరింత స్ట్రాంగ్ తిరిగొచ్చిందని కామెంట్స్ చేయగా.. దీనిపై స్పందించన సామ్ లవ్ సింబల్స్ పెట్టి ట్వీట్ చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది