Ram Charan : సైనికుల‌తో క‌లిసి భోజనం చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. సంతోషాన్ని షేర్ చేసుకున్న చెర్రీ

Authored By Sam C | The Telugu News | Published on: April 20, 2022, 1:30 pm

Ram Charan : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌లక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్ట‌డంతో అదే ఉత్సాహంతో ప‌లు సినిమాలు చేస్తున్నాడు. చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది.రామ్ చరణ్ తన 15వ చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, షూటింగ్ కు గ్యాప్ రావడంతో రామ్ చరణ్ అమృత్ సర్ కు సమీపంలోని ఖాసా సరిహద్దుల వద్దకు వెళ్లారు. అక్కడ దేశ రక్షణ విధుల్లో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లను కలిశారు.

జవాన్లతో ముచ్చటించడమే కాదు, వారితో కలిసి భోజనం కూడా చేశారు. ఎంతో ఉత్సాహంగా ఫొటోలు దిగి జవాన్లను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. సైనికులతో తన సమయాన్ని గడపడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. దేశ రక్షణ కోసం కుటుంబాన్ని త్యాగం చేసి వారి చేస్తోన్న దేశ సేవను ఎంత పొగిడిన తక్కువే అన్నారు. వారితో గడిపే సమయం దొరకడం తన అదృష్టమన్నారు. దిల్ రాజు బ్యానర్లో శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.రామ్ చరణ్ ఒకవైపు ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే..

ram charan meets soldiers

ram charan meets soldiers

Ram Charan  : సైనికుల‌తో చ‌ర‌ణ్‌..

మరోవైపు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఒక కాలండర్ ఇయర్‌లో అది కూడా నెల గ్యాప్‌లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల కావడం ఇదే మొదటి సారి. అటు శంకర్ సినిమా చేస్తూనే.. రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నారు. ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను స్పోర్ట్స్ అండ్ యాక్షన్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp