Ram Charan : తొలిసారి నెగెటివ్ రోల్ చేస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..!

Authored By Sam C | The Telugu News | Published on: May 24, 2022, 6:30 pm

Ram Charan : ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇన్నేళ్ల కెరీర్‌లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే కాలండర్ ఇయర్‌లో విడుదల కావడం ఇదే మొదటి సారి. ఇదో రికార్డుగా చెప్పుకుంటున్న మెగాభిమానులు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో చేసిన హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఇప్పటి వరకు నటించలేదు. ఇక శంకర్ తమిళ, హిందీ హీరోలతో తప్పించి ఓ తెలుగు హీరోతో ఇంత వరకు ఒక్క సినిమా తెరకెక్కించలేదు. రామ్ చరణ్‌తో తొలిసారి తొలి తమిళేతర దక్షిణాది హీరోతో శంకర్ సినిమా చేస్తున్నారు.

వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.రామ్ చ‌ర‌ణ్ -శంక‌ర్ చిత్రంలో కియారా అద్వాని క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా వైజాగ్ షెడ్యూల్‌లో చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్.

Ram Charan plays negative role

Ram Charan plays negative role

Ram Charan : గాసిప్స్‌పై క్లారిటీ..!

అయితే ఈ షెడ్యూల్‌లో చరణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడని.. ఓ పాత్రలోని చరణ్‌కు కోపం ఎక్కువగా ఉంటుందని.. అతడు చేసే మ్యానరిజం చూడటానికి చాలా బాగుంటుందని తెలుస్తోంది.ఇక మ‌రి కొంద‌రు రామ్ చరణ్ మూడు పాత్రలు చేస్తున్నాడని అంటున్నారు. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరో రెండు ట్విన్స్ అట. అయితే ఈ వార్తల్లో ఎలాంటినిజం లేదని అంతర్గత సమాచారం. చరణ్ కేవలం రెండు పాత్రల్లో మాత్రం కనిపిస్తాడని మూడు రోల్స్ చెయ్యడం లేదని వినికిడి. మరి ఆ గాసిప్స్ లో అయితే ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

Sam C

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp