RC16 : ‘ఆట కూలీ’ పాత్రలో రామ్ చరణ్.. అదేంటి అనుకుంటున్నారా..?
ప్రధానాంశాలు:
RC16 : ‘ఆట కూలీ’ పాత్రలో రామ్ చరణ్.. అదేంటి అనుకుంటున్నారా..?
RC16 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram CHaran , జాన్వీ కపూర్ janhvi kapoor జంటగా బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రబృందం అర్ధరాత్రి వరకు షూటింగ్‌ను కొనసాగిస్తూ, కథకు తగినంత ఇన్నోవేటివ్ విజువల్స్ అందించేందుకు శ్రమిస్తోంది. తాజా షెడ్యూల్‌లో జాన్వీ కపూర్ కూడా పాల్గొనగా, త్వరలోనే శివ రాజ్ కుమార్ లుక్ టెస్ట్ పూర్తయిన నేపథ్యంలో ఆయన సీన్స్ కూడా షూట్ కానున్నాయి.

RC16 : ‘ఆట కూలీ’ పాత్రలో రామ్ చరణ్.. అదేంటి అనుకుంటున్నారా..?
RC16 సరికొత్త స్పోర్ట్స్ డ్రామా గా ‘RC16’
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాలు ఒకే ఆటను ఆధారంగా చేసుకుని కథను నడిపిస్తాయి. కానీ RC16 మాత్రం ఈ ఫార్మాట్‌ను అధిగమించి, క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి అనేక రకాల ఆటలను కలిపి, కొత్త తరహా కంటెంట్ అందించనుందని సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ‘ఆట కూలీ’ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అంటే ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువ ఉండే క్యారెక్టర్ కావడంతో చరణ్ పూర్తి గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో బిగ్ మాస్ ఎంటర్టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది. రామ్ చరణ్ వరుసగా పాన్-ఇండియా సినిమాలు చేస్తూ, తన మార్కెట్‌ను విస్తరిస్తూ వెళ్లిపోతున్నారు. RRR సక్సెస్ తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా జాతీయ స్థాయిలో క్రేజీ ప్రాజెక్ట్‌గా మారుతోంది. RC16 లోనూ బుచ్చి బాబు తనదైన నేటివిటీ టచ్‌తో, స్టైల్‌తో, కథను నడిపించనున్నట్లు టాక్. ఇక రామ్ చరణ్ – జాన్వీ కపూర్ కలయిక చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు సాగితే, RC16 రామ్ చరణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశముంది.