Ram Charan : రామ్ చరణ్‌ అభిమానులకు ఇది ఊరటనా? భయ పెడుతుందా?

Authored By aruna | The Telugu News | Published on: August 25, 2022, 6:40 pm

Ram Charan : మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా చిత్రీకరణ నిలిచి పోయిందని… దాదాపుగా మూడు నాలుగు నెలల పాటు శంకర్ ఆర్ సీ 15 సినిమా ను పక్కన పెట్టి ఇండియన్ 2 ను మొదలు పెట్టి పూర్తి చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే ఇండియన్ 2 సినిమా తాజాగా పునః ప్రారంభం అయ్యింది. దాంతో రామ్‌ చరణ్‌ తదుపరి సినిమా పని లో పడుతాడా అంటూ అంతా అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో దర్శకుడు శంకర్ ట్విట్టర్ లో చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సినీ వర్గాల వారిని మరియు మెగా ఫ్యాన్స్ ను ఆకర్షిస్తోంది.

శంకర్‌ ట్విట్టర్ లో ఇండియన్ 2 సినిమా మొదలు పెట్టిన విషయం నిజమే కానీ.. రామ్‌ చరణ్ సినిమా షూటింగ్ ను పక్కకు పెట్టిన మాట మాత్రం వాస్తవం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇండియన్ 2 సినిమా తో పాటు ఆర్ సీ 15 సినిమా ను కూడా సమాంతరంగా షూటింగ్‌ జరుపబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ జరుగుతోంది. వెంటనే సెప్టెంబర్‌ మొదటి వారం లో రామ్ చరణ్ మరియు శంకర్ కాంబో సినిమా ను పునః ప్రారంభించబోతున్నట్లుగా దర్శకుడు శంకర్ పేర్కొన్నాడు.

Ram Charan Shankar movie RC 15 interesting update fans in confusion

Ram Charan Shankar movie RC 15 interesting update fans in confusion

హైదరాబాద్‌ మరియు వైజాగ్‌ లో ఆర్ సీ 15 సినిమా సెప్టెంబర్ మొదటి వారం లో షూటింగ్‌ నిర్వహించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఒకే సారి రెండు సినిమాలను ఒకే దర్శకుడు చేయడం అనేది చాలా పెద్ద సాహసం. ఇలాంటి ప్రయత్నాలు ఈ తరం దర్శకులు ఎవరు చేయడం లేదు.. చేయలేదు. శంకర్ ఈ ప్రయత్నం చేయడం వల్ల ఏం జరుగుతుందో అనే ఆందోళన చాలా మంది లో వ్యక్తం అవుతోంది. చరణ్ అభిమానులు ఆర్‌ సీ 15 సినిమా నిలిచి పోనందుకు సంతోషించాలా రెండు సినిమాలు శంకర్ ఒకే సారి చేస్తున్నందుకు భయపడాలా అనేది అర్థం కావడం లేదు అంటున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp