Ram Charan : ఏది ప‌డితే అది వాగితే ఊరుకునేదే లేదు అంటూ ప్ర‌త్య‌ర్ధుల‌కి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 January 2023,6:00 pm

Ram Charan : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చాలా సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ‌తారు. అయితే త‌న‌ని కాని త‌న ఫ్యామిలీని కాని ట‌చ్ చేస్తే మాత్రం అస్స‌లు ఊరుకోరు. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో వార్నింగ్ ఇచ్చిన చ‌ర‌ణ్ తాజాగా వ‌రంగ‌ల్ గ‌డ్డ సాక్షిగా త‌న ప్ర‌త్య‌ర్ధుల‌కి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య చిత్రం అతి పెద్ద విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞత తెలుపుకోవాలని భావించిన మూవీ టీమ్ హన్మకొండ నగరంలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మానికి స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేల‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజ‌ర‌య్యారు. మాస్ వార్నింగ్,

Ram Charan strong counter to rk roja

Ram Charan strong counter to rk roja

ముందుగా సైలెంట్‌గా స్టేజ్ మీదకు ఎక్కిన రామ్ చ‌ర‌ణ్‌.. చిరంజీవిని ఎవరైనా ఏదైనా అనాలంటే.. అది కేవలం అభిమానులు, కుటుంబ సభ్యులు మాత్రమే అనాలి. సాధారణంగా చిరంజీవి చాలా నిశ్శబ్ధంగా ఉంటారు. బాగా సౌమ్యులు అని అంటుంటారు. ఆయన క్వైట్‌గా ఉంటేనే ఇంత మందిమి వచ్చాం. అదే ఆయన కొంచెం బిగించి..గట్టిగా మాట్లాడితే.. ఏమవుతుందో ఇతరులకు ఇంకా తెలియదు. ఆయన సైలెంట్‌గా ఉంటాడేమో. గుర్తు పెట్టుకోండి..వెనకాల ఉన్న మేమే మాత్రం మౌనంగా ఉండము. మేం అందరం ఉన్నాం. మేం క్వైట్‌గా ఉండము అని.. క్వైట్‌గానే చెబుతున్నాం అంటూ వరంగల్ సభలో రామ్ చరణ్ గ‌ర్జించారు.

Ram Charan strong counter to rk roja

Ram Charan strong counter to rk roja

అయితే రామ్ చ‌ర‌ణ్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించి అని అంత‌టా చ‌ర్చ న‌డుస్తుంది. కాగా, కొద్ది రోజుల క్రితం , కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన రోజా.. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ .. ఈ ముగ్గురు అన్నాదమ్ముళ్లపై విమర్శలు గుప్పించారు. సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా సంచ‌ల‌న కామెంట్స్ చేశారుజ‌ సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారని కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నార‌ని రోజా విమర్శించారు.ఇంతవ‌ర‌కు ఏ ఒక్కరికీ ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. ఇవి మ‌న‌సులో పెట్టుకొనే చర‌ణ్ గ‌ట్టిగా వార్పింగ్ ఇచ్చాడ‌ని చెబుతున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి