Ram Gopal Varma : ఆర్జీవీ లేదా రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసినా సంచలనమే. అవును.. ఆయనే ఒక సంచలనం. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అలాంటి డైరెక్టర్ లేడు. రాలేడు కూడా. ఆర్జీవీ అంటేనే యూనిక్ పీస్. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిలగాడు అన్నట్టుగా ఆర్జీవీ చేసే పనులు కొంటెగా ఉన్నా.. ఆయన మాట్లాడే మాటలు వింటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత స్ఫూర్తి పొందొచ్చు. అలా ఉంటాయి ఆయన మాటలు. ఆయన మాటలకు పడిపోని వాళ్లు ఉండరు కానీ.. ఆయనన చేసే చేష్టలే ఆయన అభిమానులు బాధపడేలా చేస్తాయి. యాంకర్లు, హీరోయిన్ల ముందు సొల్లు కార్చడం, వాళ్ల పాదాలు పట్టుకొని నాకడం లాంటివి చేస్తూ ఆయన చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆయన ట్వీట్ చేసినా.. ఏవైనా వ్యాఖ్యలు చేసినా రచ్చ రచ్చ అవ్వాల్సిందే. ప్రతి ఘటనలోనూ ఆయన ట్రెండింగ్ అవుతుంటారు.
ఏ విషయంలో అయినా దూరుతుంటారు. ఎదుటివాళ్లు ఎవరైనా సరే.. వాళ్లను ఏం అనాలనుకుంటే అది అనేస్తారు ఆర్జీవీ. ఆదే ఆయన తత్వం. ఆయన అంటే నచ్చిన వాళ్లు ఆయన ఏం చెబితే అదే సూపర్బ్ అంటూ పొగుడుతుంటారు. ఆయనంటే నచ్చని వారు ఆర్జీవీ ఏం చేసినా అందులో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతుంటారు. అయితే.. ఆర్జీవీ మనస్తత్వమే డిఫరెంట్ గా ఉంటుంది. తనకు నచ్చినట్టుగా బతకడం కోసం సొంత భార్యకే విడాకులు ఇచ్చాడు ఆర్జీవీ. అమ్మాయిలను కూడా బాగా ఆరాధిస్తాడు. తనకు నచ్చినట్టు బతకడంలో ఆర్జీవీని మించిన వాడు లేడు. తన మనసులో ఏది ఉంటే అది టక్కున చెప్పేయగలడు. ఏమాత్రం ఆలోచించడు. సినిమాలో విషయంలోనూ అంతే.

Ram Gopal Varma : తనకు నచ్చినట్టు బతకడానికి భార్యకు విడాకులు ఇచ్చేసిన ఆర్జీవీ
డిఫరెంట్ జానర్ లో సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. ఒక రక్తచరిత్ర, ఒక జీఎస్టీ, డేంజరస్, ఇలాంటి సినిమాల ఆర్జీవీని చూశాం.. శివ లాంటి సినిమా తీసిన ఆర్జీవీని కూడా చూశాం. మరోవైపు ఆర్జీవీ కుర్ర హీరోయిన్లతో రచ్చ రచ్చ చేస్తుంటాడు. అప్సర రాణి కావచ్చు.. అషూ రెడ్డి కావచ్చు.. ఇలా ప్రస్తుతం ఆర్జీవీ ఇలాంటి కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. వారితో రొమాంటిక్ గా గడిపితే చాలు.. ఆర్జీవీకి ఎనలేని ఎనర్జీ వస్తుంది. ఒకేసారి రిలాక్స్ అయిపోతాడు. తనకంటే తక్కువ వయసు ఉన్నవాళ్లతోనే ఆర్జీవీ రొమాన్స్ చేయాలనుకుంటాడా? నిజంగానే ఆర్జీవీలో అంత మ్యాటర్ ఉందా అని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.