ఒడిలో హీరోయిన్ చేతిలో మందు.. గోవాలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో ఆర్జీవీ రచ్చ
రామ్ గోపాల్ వర్మ కు అమ్మాయిలంటే ఎంత ఇష్టమో అందరకీ తెలిసిందే. సెక్స్ అన్నా అమ్మాయిలన్నా కూడా ఆర్జీవీ ఎనలేని ఆసక్తి ఉంటుందని బహిరంగంగానే చెబుతుంటాడు. అయితే తాను ఎప్పుడూ కూడా ఎవ్వరినీ బలవంత పెట్టను అంటూ ఇష్టపూర్వకంగానే సన్నిహితంగా ఉంటానని చెప్పుకొంటాడు. అలా ఆర్జీవీ తన హీరోయిన్లతో కలిసి దుమ్ములేపుతుంటాడు. అలా అని అందరితోనూ అలానే ఉంటాడా? అంటే అది నిజం కాదు.

Ram Gopal Varma enjoys with Pooja Bhalekar In Goa For New year celebration
పరస్పర అంగీకారంతోనే హీరోయిన్లతో రచ్చ రచ్చ చేస్తుంటాడు. లాక్డౌన్‌లోనూ తన పర్సనల్ లైఫ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా షూటింగ్ అంటూ అప్సరా రాణితో ఆర్జీవీ అర్దరాత్రి హల్చల్ చేశాడు. పార్టీలు చేసుకుంటూ హీరోయిన్‌ను హత్తుకుని భుజంమీద చేతులు వేసి.. ముద్దులు పెడుతూ రచ్చ చేశాడు. మామూలుగానే ఆర్జీవీ ఆ రేంజ్‌లో దూసుకుపోతుంటాడు. అలాంటిది న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అంటే ఇంకెలా చేస్తాడో అందరూ ఊహించేదే.
ప్రస్తుతం ఆర్జీవీ ఆఫీస్ గోవాలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. పూజా భలేకర్ కూడా అక్కడే షూటింగ్ కోసం ఉంది. ఇక ఈ ఇద్దరూ మాత్రం న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో బాగా మునిగి తేలారు. ఆర్జీవీ పూజాను ఒడిలో కూర్చోబెట్టుకుని చేతిలో మందు పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చాడు. మొత్తానికి ఆ చుట్టు పక్కల చూస్తే.. పార్టీ ఘనంగా జరిగినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఆర్జీవీ అంటే ఆ మాత్రం హల్చల్ ఉండాల్సిందే కదా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Celebrating in Goa with the fighter girl @PoojaBofficial pic.twitter.com/Pb6L5yzrKw
— Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2020