Ram : రామ్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఆ తమిళ దర్శకుడే ఛాన్స్ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram : రామ్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఆ తమిళ దర్శకుడే ఛాన్స్ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్ ..!

 Authored By govind | The Telugu News | Updated on :18 February 2021,9:49 am

Ram : రామ్ .. లేటెస్ట్ సినిమా ని ప్రకటించాడు. కోలీవుడ్ దర్శకుడు ఎన్.లింగు స్వామీ దర్శకత్వం రామ్ నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు రామ్. ఈ సక్సస్ తో రామ్ కి విపరీతంగా మాస్ హీరో క్రేజ్ వచ్చేసింది. దాంతో ఎక్కువగా మాస్ ఎంటర్‌టైనర్స్ ని చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. పూరి జగనాధ్ ఇచ్చిన సాలీడ్ హిట్ తో రామ్ ఇప్పట్లో క్లాస్ సినిమా కథను ఎంచుకునేలా లేడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో మాస్ హీరో కి ఉన్న క్రేజ్ ఫాలోయింగ్.. క్లాస్ హీరోకి అంతగా ఉండదన్న సంగతి తెలిసిందే. ఈ విషయం రామ్ కి చాలా లేట్ గా అర్థమైంది…

Ram Pothineni

Ram Pothineni

ఈ క్రమంలోనే ఇస్మార్ట్ శంకర్ తర్వాత చాలా విన్నప్పటికి తమిళ సూపర్ హిట్ సినిమా తడం ని తెలుగుతో రీమేక్ చేయాలని డిసైడయ్యాడు. పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మాతగా.. ఇప్పటికే రామ్ కి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కిషోర్ తిరుమదల దర్శకత్వంలో రెడ్ సినిమాలో నటించాడు. రామ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి రిలీజై మంచి కమర్షియల్ హిట్ గా నిలిచంది. రామ్ ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా ఆ నమ్మకాన్ని నిలబెట్టింది.

Ram : రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తమిళ దర్శకుడు ఎన్.లింగు స్వామీ తో చేస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు.

ఈ క్రమంలో రామ్ నెక్స్ట్ సినిమా ఏ దర్శకుడితో ఉంటుందో అని గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రామ్ తో పలువురు దర్శకులు సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. కాని రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తమిళ దర్శకుడు ఎన్.లింగు స్వామీ తో చేస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఈ సినిమాని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించబోతున్నాడు. ఇక ఈ సినిమా రామ్ కెరీర్ లో 19 గా రాబోతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి…

 

 

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది