Ram Pothineni
Ram : రామ్ .. లేటెస్ట్ సినిమా ని ప్రకటించాడు. కోలీవుడ్ దర్శకుడు ఎన్.లింగు స్వామీ దర్శకత్వం రామ్ నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు రామ్. ఈ సక్సస్ తో రామ్ కి విపరీతంగా మాస్ హీరో క్రేజ్ వచ్చేసింది. దాంతో ఎక్కువగా మాస్ ఎంటర్‌టైనర్స్ ని చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. పూరి జగనాధ్ ఇచ్చిన సాలీడ్ హిట్ తో రామ్ ఇప్పట్లో క్లాస్ సినిమా కథను ఎంచుకునేలా లేడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో మాస్ హీరో కి ఉన్న క్రేజ్ ఫాలోయింగ్.. క్లాస్ హీరోకి అంతగా ఉండదన్న సంగతి తెలిసిందే. ఈ విషయం రామ్ కి చాలా లేట్ గా అర్థమైంది…
Ram Pothineni
ఈ క్రమంలోనే ఇస్మార్ట్ శంకర్ తర్వాత చాలా విన్నప్పటికి తమిళ సూపర్ హిట్ సినిమా తడం ని తెలుగుతో రీమేక్ చేయాలని డిసైడయ్యాడు. పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మాతగా.. ఇప్పటికే రామ్ కి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కిషోర్ తిరుమదల దర్శకత్వంలో రెడ్ సినిమాలో నటించాడు. రామ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి రిలీజై మంచి కమర్షియల్ హిట్ గా నిలిచంది. రామ్ ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా ఆ నమ్మకాన్ని నిలబెట్టింది.
ఈ క్రమంలో రామ్ నెక్స్ట్ సినిమా ఏ దర్శకుడితో ఉంటుందో అని గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రామ్ తో పలువురు దర్శకులు సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. కాని రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తమిళ దర్శకుడు ఎన్.లింగు స్వామీ తో చేస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఈ సినిమాని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించబోతున్నాడు. ఇక ఈ సినిమా రామ్ కెరీర్ లో 19 గా రాబోతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.