Allu Arjun : అవునా.. అక్క‌డ అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Arjun : అవునా.. అక్క‌డ అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువా..?

Allu Arjun : బాలీవుడ్ లో అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటి రామ్ మన దగ్గర కేవలం టైర్ 2 హీరో మాత్రమే కదా అతను ఎలా అల్లు అర్జున్ ని మించి వెళ్తాడని అనుకోవచ్చు. రామ్ నటించిన సినిమాలు తెలుగులో ఆడకపోయినా హిందీలో బాగా ఆడతాయి. అది కూడా యూట్యూబ్ లో రామ్ యాక్షన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. రామ్ సినిమా ఏదైనా వచ్చింది అంటే […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 September 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : అవునా.. అక్క‌డ అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువా..?

Allu Arjun : బాలీవుడ్ లో అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటి రామ్ మన దగ్గర కేవలం టైర్ 2 హీరో మాత్రమే కదా అతను ఎలా అల్లు అర్జున్ ని మించి వెళ్తాడని అనుకోవచ్చు. రామ్ నటించిన సినిమాలు తెలుగులో ఆడకపోయినా హిందీలో బాగా ఆడతాయి. అది కూడా యూట్యూబ్ లో రామ్ యాక్షన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. రామ్ సినిమా ఏదైనా వచ్చింది అంటే చాలు హిందీ లో డబ్ చేసి మరీ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. రామ్ సినిమాలు బాలీవుడ్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే రామ్ కి అక్కడ పాపులారిటీ ఉంది. పుష్ప 1 తో సూపర్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ కన్నా రామ్ కే బాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉందని తెలుస్తుంది. ఈమధ్యనే రామ్ సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లగా అక్కడ ఒక చిన్న ఊరిలో రామ్ ని గుర్తు పట్టి అక్కడ అభిమానులు అతనితో ఫోటోలు దిగారట.

రామ్ కూడా అక్కడి వారికి తాను తెలిసని నమ్మలేకపోయాడట. ఇలా చిన్న ఊళ్లలోకి కూడా రామ్ క్రేజ్ పాకింది. పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకుని జాతీయ అవార్డ్ అందుకున్నా సరే అల్లు అర్జున్ హిందీలో అందరికీ తెలియదు. అందుకే రామ్ డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా రిలీజ్ చేశాడు. పూరీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. రామ్ సినిమాలు యూట్యూబ్ లో కోట్ల కొద్దీ వ్యూస్ రాబడతాయి కాబట్టి అక్కడ భారీ హిట్ కొడుతుందని అనుకున్నా నిరాశపరచింది.

Allu Arjun అవునా అక్క‌డ అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువా

Allu Arjun : అవునా.. అక్క‌డ అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువా..?

రామ్ అల్లు అర్జున్ ఎవరి స్టైల్ వారిది. అల్లు అర్జున్ పుష్ప 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. అల్లు అర్జున్ కి తెలుగులో స్టార్ డం ఉండగా బాలీవుడ్ లో రామ్ తర్వాతే అల్లు అర్జున్ క్రేజ్ అన్నది కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది