Unstoppable 2 : నీకు అంత ధైర్యం ఉందా బాలకృష్ణా? రమ్యకృష్ణని  ‘ఆ ప్రశ్న ‘ అడిగే దమ్ము ఉందా ?

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 October 2022,5:30 pm

Unstoppable 2 : బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాబుల్ సీజన్ వన్ కు వచ్చిన క్రేజ్ తో రెండో సీజన్ ను కూడా వెంటనే ప్రారంభించారు. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ ను ఏకంగా ప్రముఖ రాజకీయ నాయకులు చంద్రబాబు, లోకేశ్ తో తీశారు. రెండో ఎపిసోడ్ కు ఏకంగా డీజే టిల్లు సిద్దు, విశ్వక్సేన్ ను పిలిచారు. అయితే.. మూడో ఎపిసోడ్ కు ఎవరు రానున్నారు అంటూ చాలామందిలో ఆతృత మొదలైంది. నిజానికి రెండో ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు కానీ.. ప్రోమో మాత్రమే వచ్చింది.

అందుకే మూడో ఎపిసోడ్ కోసం బాలయ్య బాబు ఏకంగా అందమైన భామలను సిద్ధం చేశాడట.  వాళ్లు ఎవరో కాదు.. ఒకరు సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ, మరొకరు అందాల రాశి ఖన్నా. ఇద్దరు ఇద్దరే. అయితే.. ఇంకా వీళ్ల షూటింగ్ స్టార్ కాలేదు. వీళ్లు షూటింగ్ రెండు మూడు రోజుల్లో జరుగుతుందట. కానీ.. ఇప్పటికే వీళ్లు మూడో ఎపిసోడ్ కు గెస్టులుగా వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బాలయ్య బాబుతో రమ్యకృష్ణ చాలా సినిమాల్లో నటించింది. ఈనేపథ్యంలో రమ్యకృష్ణ జీవితంలో చాలా చేదు ఘటనలు కూడా జరిగాయి. మరి.. రమ్యకృష్ణ కాంట్రవర్సీని బాలయ్య లేవనెత్తుతారా?

ramya krishna as the next guest for balakrishna unstoppable 2

ramya krishna as the next guest for balakrishna unstoppable 2

Unstoppable 2 : రమ్యకృష్ణ కాంట్రవర్సీని బాలయ్య లేవనెత్తుతారా?

అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తన భర్త కృష్ణవంశీతోనూ తనకు విభేదాలు ఉన్నట్టు ఆమధ్య వార్తలు వచ్చాయి. మరి.. ఇలాంటి నేపథ్యంలో రమ్యకృష్ణ చేదు ఘటనలను బాలయ్య తవ్వుతారా? అని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు రాశి ఖన్నా జీవితంలో ఏ విషయాలను బాలకృష్ణ అడుగుతారు. తను ఎవరితోనైనా డేటింగ్ లో ఉందా? లేదా? అనే విషయాలు ఇక ఈ షోతో ఎలాగూ తేలిపోనున్నాయి. అందుకే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పడు ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఆ అందమైన భామలతో బాలయ్య ఎలా ఆడుకుంటారో చూడాలి మరి.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి