Ramya Krishnan : ఎంతో భవిష్యత్ ఉందట.. హీరోయిన్‌పై రమ్యకృష్ణ కామెంట్స్
Ramya Krishnan : పూరి జగన్నాథ్ ఓ అమ్మాయిని హీరోయిన్‌గా ఎంచుకున్నాడంటే కచ్చితంగా ఆమెలో విషయం ఉన్నట్టే. ఆ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయింది కూడా. అసలే పూరి హీరోలంటే కాస్త ఘాటుగా ఉంటారు. అందంలోనూ, నడవడికలోనూ పూరి స్టైల్ కనిపిస్తుంది. రౌడీలా ప్రవర్తించే హీరోయిన్లు, అమాయకత్వంతో ఆకట్టుకునే హీరోయిన్లతో పూరి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రేణూ దేశాయ్, అసిన్, రక్షిత ఇలా ఎంతో మందిని పూరి పరిచయం చేశాడు…

Ramyakrishnan about Ananya Pandey In Liger
అందరూ కూడా మంచి నటీమణులే. అందంలోనూ ఏ మాత్రం తక్కువకాదు. అయితే ఇప్పుడు పూరి తన సినిమా కోసం బాలీవుడ్ భామను పట్టాడు. అది కూడా అక్కడ ఆల్రెడీ నిరూపించుకున్న అమ్మాయే. అయితే ఆమెపై వారసత్వ ముద్ర కూడా ఉంది. అనన్య పాండే తన నటనతో బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. కానీ తనలోని దాగి ఉన్న నటీమణిని బయటకు తీసేందుకు పూరి రెడీ అయ్యాడు. అందుకే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా ఎంచుకున్నాడు.
Ramya Krishnan హీరోయిన్‌పై రమ్యకృష్ణ కామెంట్స్
ఇదే విషయాన్ని ఇప్పుడు రమ్యకృష్ణ కూడా చెప్పింది. విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ ఓ అద్భుతమైన పాత్రను పోషిస్తోంది. అయితే గత రెండు మూడు రోజులుగా ఈ ముగ్గురి కాంబోలో సీన్స్ షూట్ చేస్తున్నారు. తాజాగా అనన్య పాండేతో రమ్యకృష్ణ సీన్ షూట్ చేసినట్టున్నారు. ఆమెతో పని చేయడం ఎంతో సరదాగా ఉందంటూ అనన్య గురించి చెప్పుకొచ్చింది. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఈ అమ్మాయి కోసం రెడీగా ఉందంటూ ఆమె నటనపై ప్రశంసలు కురిపించింది.