Rana : రానా త‌మ్ముడు ఏ సినిమాతో ఆరంగేట్రం చేయ‌బోతున్నాడో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: January 15, 2022, 10:00 pm

Rana: ద‌గ్గుబాటి రామానాయుడు వార‌సులుగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు సురేష్ బాబు, వెంక‌టేష్‌. సురేష్ బాబు నిర్మాత‌గా టాప్ పొజీష‌న్‌లో ఉండ‌గా, వెంక‌టేష్ హీరోగా ఇప్పటికీ కుర్ర హీరోల‌కు కాంపిటీష‌న్‌గా మారాడు. ఇక అనంత‌రం రానా లీడ‌ర్ సినిమాతో ప‌రిచ‌యం అయ్యాడు. బాహుబ‌లి సినిమాతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. కేవ‌లం హీరోగానే కాకుండా విల‌న్‌గాను అద‌ర‌గొడుతున్నాడు. అయితే రానా సోద‌రుడు కూడా వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు ఎప్ప‌టి నుండో ప్ర‌చారం న‌డుస్తుంది. తాజాగా మానాడు రీమేక్‌ అతడి సోదరుడు అభిరామ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఈ మూవీ రీమేక్‌ హక్కులను సురేష్‌ ప్రొడక్షన్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మొదట ఈ రీమేక్‌లో రానా నటించనున్నాడని టాక్‌ వినిపించగా.. తాజాగా అభిరామ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో అభిరామ్ ఒక సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే ‘మానాడు’ రీమేక్ మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగులో ది లూప్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

brother remakes maanadu

brother remakes maanadu

ranaRana : రానా సోద‌రుడు ఆరంగేట్రం ఎప్పుడు..?హీరో శింబు నటించిన మానాడు సినిమా ఎస్.ఎస్.ఐ. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం కాగా, ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు. తమిళంలో పోయిన ఏడాది నవంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్ డ్రామాను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. హీరోకి .. విలన్ కి మధ్య మైండ్ గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాను ముందుగా తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా కేవలం తమిళ్ లోనే రిలీజ్ అయ్యింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp