Rana Daggubati : రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలలో బాహుబలి చిత్రం ఒకటి. ఇందులో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించగా, భళ్లాలదేవుడిగా నెగెటివ్ పాత్రలో రానా కనిపించిన సందడి చేశాడు. ఇండస్ట్రీలో గొప్ప పేరున్న దగ్గుబాటి వారి ఇంటి నుంచి వచ్చినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించారు రానా. ఆ ప్రయత్నంలో ఆయన సఫలమయ్యారనే చెప్పాలి. తన కెరీర్‌లో ఆయన చాలా పాత్రలు పోషించారు. కానీ, ఆయన దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ‘బాహుబలి’లోని భళ్లాలదేవుడి పాత్ర. ‘బాహుబలి’ తరవాత రానా చాలా సినిమాలే చేసినా ఆ స్థాయిలో హిట్ అవ్వలేదు.
అయితే ఇటీవల ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ దర్శకుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాజమౌళి బాహబలికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాహుబలి సినిమా ఆలోచన వచ్చినప్పుడు ప్రభాస్ దగ్గరకి వెళ్లి రాజుల కథతో నిన్ను పెట్టి సినిమా చేయాలని అనుకుంటున్నాను. బాహుబలి అనే వీరుడు, యుద్ధానికి వెళ్లినప్పుడు ఒక్క గాయం లేకుం తిరిగి వస్తాడు అని కథ చెప్పడంతో ప్రభాస్ వెంటనే ఓకే చేశాడు. అయితే ఇందులో విలన్ పాత్రకి ప్రాముఖ్యత బాగా ఉండడంతో ఇందుకోసం హాలీవుడ్ నటుడు జేసన్ మమోవాను మొదట అనుకున్నారంటా.. ఆక్వామెన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న జేసన్ అయితే సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావించారు.
అయితే నిర్మాత శోభు యార్లగడ్డ రానాను కలిసి బాహుబలి కథ గురించి తెలిపారు. దీంతో రానా బదులిస్తూ.. నాకంటే ముందు ఈ పాత్ర కోసం ఎవరిని అనుకున్నారని అడగగా, మమోవాను అనుకున్నామని శోభు చెప్పడంతో ఆ సమయంలో రానా నవ్వేసి భళ్లాల దేవుడి పాత్రలో నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలాంటివి ఎన్నో విషయాలు రాజమౌళి తెలియజేశాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.