#image_title
Bigg Boss Telugu 7 : మహాబలి వర్సెస్ రణధీర అనే రెండు టీమ్స్ ను ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ అయినా మాయాస్త్రను సాధించాలని దాని కోసం చాలా పోటీలు ఎదుర్కోవాలని బిగ్ బాస్ పోటీ పెడతారు. రెండు పోటీలలో గెలిచిన శివాజీ టీమ్ రెండు కీలను సాధిస్తుంది. రెండు కీలు వాళ్ల దగ్గరికి చేరాయి కానీ.. మాయాస్త్ర ఎక్కడుంది. మాయాస్త్ర కోసం పోటీ ఏంటి అనేది మాత్రం ఇంకా బిగ్ బాస్ చెప్పలేదు. రెండు పోటీలలో శివాజీ టీమ్ మాత్రం గెలిచింది. ఇక.. కీస్ ఎవరు దొంగలించినా కూడా వారిదే మాయాస్త్రం అవుతుంది. కానీ.. టాస్క్ ఇచ్చిన సమయంలో ఎవ్వరూ శివాజీ టీమ్ దగ్గర్నుంచి కీస్ పొందలేకపోయారు. దీంతో ఆ మాయాస్త్రాన్ని పొందే చాన్స్ శివాజీ టీమ్ కే దక్కింది.
#image_title
చివరకు శివాజీ టీమ్ యాక్టివిటీ రూమ్ కి వెళ్లి అక్కడ మాయాస్త్రానికి సంబంధించిన కొన్ని అస్త్రాలను తీసుకుంటారు. అయితే.. మాయాస్త్ర కోసం శివాజీ టీమ్ ఇంత కష్టపడితే.. వాటిని ఎవరైనా లాక్కోవచ్చు అని ఇన్ డైరెక్ట్ గా బిగ్ బాస్ క్లూ ఇస్తాడు. కానీ.. వేరే టీమ్ వాళ్లు దాన్ని పట్టించుకోరు. మాయాస్త్రాన్ని లాక్కునే అవకాశం ఉన్నప్పుడు లాక్కోకుండా.. అసలు యావర్ దగ్గర కీస్ లేకున్నా యావర్ దగ్గరికి వెళ్లి యావర్ ను డిస్టర్బ్ చేస్తారు మహాబలి టీమ్.
అయితే.. రెండో టాస్క్ పూర్తయ్యాక.. తెలుగులో యావర్ ఎక్కువగా మాట్లాడటం లేదని.. యావర్ కు బిగ్ బాస్ ఒక శిక్ష విధిస్తాడు. ఆ శిక్షను యావర్ పూర్తి చేస్తుండగానే.. ఇతర కంటెస్టెంట్లు అతడిని శిక్ష పూర్తి చేయనీయకుండా రచ్చ రచ్చ చేస్తారు. అతడి దగ్గర కీ ఉందేమో అనుకొని అతడిని చుట్టుముడతారు. అతడిని తన టాస్క్ పూర్తి చేయనివ్వరు. దీంతో శివాజీకి కోపం వచ్చి అక్కడ ఉన్న డంబెల్స్ ను విసిరేస్తాడు. అయితే ఇదంతా యావర్ దగ్గర ఉన్న వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోవడం కోసం శివాజీ చేసిన ప్రయత్నం అది. మొత్తానికి మాయాస్త్రానికి సంబంధించి అతి చేరువలోకి వెళ్తారు శివాజీ టీమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.