Ranigunta Heroine : రేణిగుంట సినిమాలో కనిపించిన అమ్మడు ఎంతలా మారిపోయింది..!
ప్రధానాంశాలు:
Ranigunta Heroine : రేణిగుంట సినిమాలో కనిపించిన అమ్మడు ఎంతలా మారిపోయింది..!
Ranigunta Heroine : 2009లో విడుదలైన ‘రేణిగుంట’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఇందులో నటించిన సనూష sanusha sanuu ఆ సినిమా తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకుంది.కేరళకు చెందిన సనూష, 2000లో బాలనటిగా ‘దాదా సాహెబ్’ అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత విక్రమ్ నటించిన ‘కాశి’ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుందర ట్రావెల్స్, భీమా, రేణిగుంట, నాలై నమడే, ఏతాన్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Ranigunta Heroine : రేణిగుంట సినిమాలో కనిపించిన అమ్మడు ఎంతలా మారిపోయింది..!
Ranigunta Heroine : ఏం చేస్తుంది..
తెలుగులో అయితే పవన్ కళ్యాణ్ నటించిన బంగారం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించి మెప్పించింది. సినీ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ, చదువుపై ఆసక్తి తగ్గకుండా కొనసాగించింది. సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన సనూష, స్కాట్లాండ్‌లో ఉన్న ఓ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పలు ఫోటోలు షేర్ చేసింది.
ఇంటికి దూరంగా ఉండటం, ఎన్నో నిద్రలేని రాత్రులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ఆరోగ్య సమస్యలు, ఒత్తిడితో పోరాడటం… ఇవన్నీ నాకు గ్రాడ్యుయేషన్ రూపంలో పెద్ద బహుమతిని ఇచ్చాయి అని చెప్పింది సనూష. ఆమె ఫొటోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. చదువులోనూ, నటనలోనూ తనదైన ముద్ర వేసిన సనూష… మళ్లీ తెరపైకి ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.