Rashi Khanna : ఆ ఇద్దరు హీరోలలో పైకి లేపేదెవరు..?
Rashi Khanna : బబ్లీ బ్యూటీగా టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ రాశి ఖన్నా. మద్రాస్ కేఫ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమైన అమ్మడు ఈ సినిమా తెచ్చిన గుర్తింపుతో వరుసగా తెలుగులో యంగ్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఎన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేసినా కూడా రాశికి రాశులు కలిసి రాలేదు. హిట్స్ దక్కినా కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకోలేపోయింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాశీ ఖన్నాకు అవకాశాలకు మాత్రం కొదవలేదు.తెలుగులో రెండు సినిమాలు కంప్లీట్ చేసింది. తమిళంలో నాలుగు చిత్రాలకు పైగానే నటిస్తోంది.
చెప్పాలంటే రాశీఖన్నా చాలా బిజీగా ఉంది. కానీ, టాలీవుడ్‌లో ఆమె పేరు ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు. ఇప్పుడు తన చేతిలో ఉన్న రెండు చిత్రాలతో హిట్ కొట్టాలని ఆరాటపడుతోంది. ఆ ఇద్దరి
చేతిలోనే రాశి నెక్స్ట్ లెవల్ కెరీర్ ఏంటో డిసైడ్ అవుతుంది. ఆ హీరోలే అక్కినేని నాగ చైతన్య, మాచో హీరో గోపీచంద్. ఇప్పటికే, గోపీచంద్ సరసన జిల్ అనే సినిమా చేసి హిట్ అందుకుంది. కానీ, నాగ చైతన్యతో మొదటిసారి జతకట్టింది. విక్రం కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించగా నాగ చైతన్య – రాశి ఖన్నా కలిసి థాంక్యూ సినిమాను చేశారు.

Rashi Khanna Pakka Commercial With Gopichand and Naga Chaitanya Thankyou movie
Rashi Khanna: ఈ రెండు సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే, మారుతి దర్శకత్వంలో ఇంతకముందు ప్రతీ రోజు పండగే సినిమా చేసి హిట్ అందుకున్న రాశి ఇప్పుడు మరోసారి గోపీచంద్ సరసన మారుతీ దర్శకత్వంలో పక్కా పక్కా కమర్షియల్ సినిమానూ కంప్లీట్ చేసింది. ఈ రెండు సినిమాలపై అంచనాలు జనాలలో బాగానే ఉన్నాయి. చైతూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అముకుంటూ మంచి ఫాంలో ఉన్నారు. గోపీచంద్ మాత్రం సాలీడ్ హిట్ కోసం చూస్తున్నారు. వీరిద్దరూ నటించిన సినిమాలు హిట్ అని చెప్పుకుంటున్నారు. మరి ఫైనల్‌గా రాశికి హిట్ ఇచ్చేదెవరో త్వరలో తెలుస్తుంది.