Rashi Khanna : అలా ఎద అందాలు ఆరబోస్తూ.. ‘ఆజా’ అంటున్న రాశిఖన్నా..!
Rashi Khanna : బ్యూటిఫుల్ హీరోయిన్ రాశిఖన్నా ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ భామ. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది ఈ భామ. ఇకపోతే ఈ సుందరి సిల్వర్ స్క్రీన్‌పైన ఫన్నీ రోల్స్ ప్లే చేయడంలో తనదైన ముద్ర వేసుకుంది.రాశిఖన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న రాశిఖన్నా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది.
తాజాగా రాశిఖన్నా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట వైరలవుతున్నాయి. దేశీయ వస్త్రాలు ‘ఆజా’ ఫ్యాషన్స్ వస్త్రాలను ప్రమోట్ చేస్తున్న ఫొటోల్లో రాశిఖన్నా అందంగా కనబడుతోంది. బ్లూ, ఆరెంజ్, వైట్ , లైట్ పింక్ కలర్ డ్రెస్సుల్లో రకరకాల ఫోజులిస్తూ రాశిఖన్నా దిగిన ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎద అందాలు చూపుతూ, చూపులతోనే మత్తెక్కిస్తూ రాశిఖన్నా అందాల‘రాశి’గా కనబడుతోందని అంటున్నారు.

Rashi khanna shared her beautiful photos in twitter
Rashi Khanna : అలా నిలబడి చూపులతోనే మత్తెక్కిస్తోన్న రాశిఖన్నా..
రాశిఖన్నా ప్రజెంట్ తెలుగులో ‘పక్కా కమర్షియల్, థాంక్యూ’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భామ నటించిన మాలీవుడ్ ఫిల్మ్ ‘బ్రహ్మం’ ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ రీమేక్. రాశిఖన్నా తమిళ్ ఫిల్మ్స్ ‘తిరుచిత్రంబలం, మేథావి, శైతాన్ కా బచ్చ’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఎక్స్‌ప్రెషన్ బ్యూటీగా పేరు గాంచిన రాశిఖన్నా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.