Rashmi Gautam : సుధీర్, రష్మీ అనుకునేలా ఇలా చేస్తున్నారా?.. కొత్త అనుమానాన్ని క్రియేట్ చేసిన ఆది, రాం ప్రసాద్

Authored By aruna | The Telugu News | Published on: May 31, 2022, 3:30 pm

Rashmi Gautam : సుధీర్ రష్మీ కెమిస్ట్రీ బుల్లితెరపై ఎలా ఉన్నా బయట మాత్రం మామూలు ఫ్రెండ్స్‌లానే ఉంటారు. తెరపై ఏదో అమర ప్రేమికులు, చిరకాల ప్రేమికులన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ నిజ జీవితంలో మాత్రం అక్కడ అంత ఉండదు. సుధీర్, రష్మీలు తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని ఎన్ని సార్లు చెప్పినా కూడా అభిమానులు మాత్రం వినరు. తెరపై వారు చేసే మ్యాజిక్‌కు పడిపోతుంటారు. రష్మీ సుధీర్ జంటగా కనిపిస్తే చాలు ఆ షో లేదా ఆ ఈవెంట్ హిట్టన్న మాటే. అంతలా ఆ జోడికి క్రేజ్ వచ్చేసింది.

అయితే గత కొంతా కాలం నుంచి ఈ ఇద్దరూ కలిసి ఈవెంట్లు గానీ, షోలకు హోస్టింగ్ గానీ చేయడం లేదు. ఒకరు కనిపిస్తే ఇంకొకరు కనిపించడం.. ఒకరు వెళ్లిపోతే ఆ తరువాత మెల్లిగా వాళ్ల స్థానంలోకి వచ్చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ జోడి ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ షోల్లో తెగ సందడి చేస్తుంటుంది. కానీ ఇప్పుడు ఆ సందడంతా మాయమైంది. సుధీర్ అయితే ఈ ఢీ పద్నాలుగో సీజన్ నుంచి రావడం లేదు. సుధీర్ లేకపోవడంతో ఆ షో దారుణమైన స్థితిలోకి వెళ్లింది. రష్మీ, ఆది, ప్రదీప్ ఇలా ఎంత ప్రయత్నించినా ఆ షోకు రేటింగ్స్ రావడం లేదు. మొత్తానికి ఆ షో నుంచి రష్మీ కూడా బయటకు వచ్చింది.

Rashmi Gautam Instead Of Sudigali Sudheer in Sridevi Drama Company

Rashmi Gautam Instead Of Sudigali Sudheer in Sridevi Drama Company

ఇక ఆ తరువాత సుధీర్ కొన్ని రోజులకు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలోనూ కనిపించడం మానేశాడు. దీంతో అక్కడ కూడా వీరిద్దరినీ చూసే చాన్స్ లేకుండా పోయింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి గెటప్ శ్రీను, సుధీర్ ఇద్దరూ దూరంగానే వెళ్లిపోయారు. తమ తమ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని, అందుకే వెళ్లిపోయారంటూ తెలుస్తోంది. అయితే ఇప్పుడు సుధీర్ మాత్రం శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి కూడా బయటకు వచ్చేశాడు. అతని స్థానంలో రష్మీ యాంకరింగ్ చేస్తోంది. దీనిపై ఆది, రాం ప్రసాద్‌లు సెటైర్లు వేశారు.

రష్మీతో చేసే.. కామెడీ షో నుంచి పాటల ప్రోగ్రాంకు హోస్ట్‌గా వెళ్లాల్సి వచ్చిందని సుధీర్ మీద పరోక్షంగా పంచులు వేస్తారు. నేను ముందు చేస్తాను.. ఆ తరువాత నువ్ చేయ్.. అని ఇద్దరూ ఈ షో యాంకరింగ్ గురించి ముందే మాట్లాడుకున్నారు కదా? అని లేనిపోని కొత్త అనుమానాలను క్రియేట్ చేశారు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp