Emmanuel : అసభ్యంగా తాకిన ఇమాన్యుయేల్.. స్టేజ్ మీదే ఫైర్ అయిన పూర్ణ.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Emmanuel : అసభ్యంగా తాకిన ఇమాన్యుయేల్.. స్టేజ్ మీదే ఫైర్ అయిన పూర్ణ.. వీడియో

Emmanuel : బుల్లితెరపై ఒక్కోసారి ఏది సెన్సేషన్ అవుతుందో చెప్పలేం. ఎవరు ఎప్పుడు ఎలా కాంట్రవర్సీలోకి ఎక్కేస్తారా? తెలియదు. అయినా కామెడీ షోలు, సింగింగ్ షోలు అంతా కూడా డైరెక్షన్ టీం చెప్పినట్టు చేస్తుంటాయి. అయితే కొన్ని సార్లు మాత్రం కావాలనే అలా చేస్తారా? లేదంటే ఫ్లోలో అలా జరుగుతుందా? అనేది చెప్పలేం. తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ప్రోమో చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎన్నో కొత్త వింతలు జరిగాయి. శ్రీదేవీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :31 May 2022,1:30 pm

Emmanuel : బుల్లితెరపై ఒక్కోసారి ఏది సెన్సేషన్ అవుతుందో చెప్పలేం. ఎవరు ఎప్పుడు ఎలా కాంట్రవర్సీలోకి ఎక్కేస్తారా? తెలియదు. అయినా కామెడీ షోలు, సింగింగ్ షోలు అంతా కూడా డైరెక్షన్ టీం చెప్పినట్టు చేస్తుంటాయి. అయితే కొన్ని సార్లు మాత్రం కావాలనే అలా చేస్తారా? లేదంటే ఫ్లోలో అలా జరుగుతుందా? అనేది చెప్పలేం. తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ప్రోమో చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎన్నో కొత్త వింతలు జరిగాయి. శ్రీదేవీ డ్రామా కంపెనీ రూపురేఖలే మారిపోయాయి.

ఇంద్రజ కనిపించలేదు, సుధీర్ యాంకర్‌గా రానేలేదు. ఇక ఇంద్రజ స్థానంలో పూర్ణ, సుధీర్ ప్లేస్‌లో రష్మీ కనిపించింది. అయితే మొత్తానికి ఇప్పుడు పూర్ణ వచ్చీ రాగానే తన మార్క్ చూపించింది. గొడవలకు దిగింది. ఒకరిని కార్నర్ చేసేసింది. ఇమాన్యుయేల్ తనను అసభ్యకరంగా తాకాడంటూ నానా హంగామా చేసేశాడు. అలా ఎలా టచ్ చేస్తావ్ అంటూ ఏడ్చేసినంత పని అయింది. అయితే ఇమాన్యుయేల్ ఏమీ కావాలని అలా చేసినట్టు కనిపించదు. ఏదో క్యాజువల్‌గానే చేయి వేశాడు.
అయితే అలా తన అనుమతి లేకుండా భుజం మీద చేతులు వేయడంతో పూర్ణ హర్ట్ అయినట్టుంది.

Poorna Gets Fires On Emmanuel For Touching Her In Sridevi Drama Company

Poorna Gets Fires On Emmanuel For Touching Her In Sridevi Drama Company

ఇక ఇమాన్యుయేల్ మాత్రం పూర్ణ అలా అనడంతో తెల్లమొహం వేసేశాడు. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కో ఆర్టిస్టులంతా వచ్చి సర్ది చెప్పేందుకు చూసినట్టు తెలుస్తోంది. ఇంతలో మరో వైపు రష్మీ కళ్లు తిరిగిపడిదపోయింది. అలా ఆ గొడవ.. ఇటు ఇలా కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రోమో బాగానే హీటెక్కేసింది. మొత్తానికి ఈ వారం మాత్రం నానా రచ్చ జరిగేట్టు కనిపిస్తోంది. అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీలో టీఆర్పీ స్టంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.

ఇమాన్యుయేల్‌ను చివరకు బక్రా చేసేలా ఉన్నారు. కొంపదీసి చివరకు ప్రాంక్ అని పూర్ణ ప్లేట్ తిప్పేస్తుందేమో చూడాలి. అసలేం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి సుధీర్ లేని లోటు మాత్రం షోలో కనిపిస్తోంది. ఢీ షోలో పూర్ణ బుగ్గలు కొరకడం, హగ్గులు ఇవ్వడం కంటే ఇదేమీ పెద్ద నేరం కాదన్నట్టుగా జనాలు కామెంట్లు పెడుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది