Rashmi Gautam : ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు రావాలంటే అందరితో పడుకోవాల్సిందేనా.. రష్మీ పోస్ట్ వైరల్
Rashmi Gautam : రష్మీ గౌతమ్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఎక్స్ ట్రా జబర్దస్త్. అవును.. ఇదివరకు హీరోయిన్ గా, హీరోయిన్ ఫ్రెండ్ గా చాలా క్యారెక్టర్లు చేసినా.. తెలుగు సినిమా అభిమానులు తనను పెద్దగా గుర్తు పెట్టుకోలేదు. కానీ.. ఎప్పుడైతే తాను జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిందో తన రేంజే మారిపోయింది.వచ్చీ రాని తెలుగులో యాంకరింగ్ చేస్తూ.. గ్లామర్ ఒలకబోస్తూ రష్మీ చేసిన హడావుడిని అందరూ చూసే ఉంటారు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో తనకు లవ్ ట్రాక్ నడవడం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద సంచలనంగా మారింది.
రష్మీ, సుడిగాలి సుధీర్.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని.. వాళ్ల మధ్య ఏదో ఉందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. కానీ.. అవేమీ నిజం కాలేదు. తమ మధ్య ఏం లేదని.. తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చాలా సందర్భాల్లో రష్మీ, సుధీర్ ఇద్దరూ చెప్పుకొచ్చారు.సోషల్ మీడియాలో కూడా రష్మీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా రష్మీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మీమ్ పై స్పందించింది.

Rashmi gautam post viarl on offers in industry
Rashmi Gautam : రష్మీ, సుధీర్ పెళ్లిపై చాలా గాసిప్స్చ
అది ఏ మీమ్ అంటే.. టాప్ పొజిషన్ కు చేరుకునేందుకు ఈమె ఖచ్చితంగా అందరితో పడుకొని ఉంటుంది అని కింద ఐశ్వర్యరాయ్ ఫోటోను పెట్టి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ను చూసిన రష్మీ.. వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఇలాంటి స్టేట్ మెంట్స్ చేయడం చాలా సులభం. అలా ఎంత సింపుల్ గా అటువంటి మాటలు మాట్లాడేస్తారు.. అంటూ ఆ ఫోటోను షేర్ చేసింది. దీంతో ఆ మీమ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Rashmi gautam post viarl on offers in industry