Rashmi Gautam : మంచి మనసు చాటుకున్న అదిరే అభి…. థ్యాంక్స్ చెప్పిన రష్మీ గౌతమ్
Rashmi Gautam : బుల్లితెరపై రష్మీ గౌతమ్ ఎలా కనిపించినా కూడా తెర వెనుక మాత్రం మంచి మనసును చాటుకుంటూ ఉంటుంది. రష్మీకి మూగ జీవాలంటే ప్రాణం. పెట్స్‌కు ఏమైనా జరిగిందంటే.. రష్మీ మనసు తల్లడిల్లిపోతుంది. ఈ సమ్మర్‌లో పెట్స్ పడే బాధల గురించి గతకొన్ని రోజులుగా రష్మీ షేర్ చేస్తూనే ఉంటుంది. ఎండాకాలం వస్తే పెట్స్ నీడ కోసం, వాటర్ కోసం పరితపిస్తుంటాయి.కార్ల కింద, లారీల కింద పెట్స్ నిద్రపోతోంటాయి…
వాటిని గమనించకుండా ఒక వేళ వాహనాలను నడిపిస్తే ప్రాణాలు పోతుంటాయి. అందుకే కాస్త జాగ్రత్తగా చూడండి.. వాటి ప్రాణాలను రక్షించండి అని రష్మీ వేడుకుంటూ ఉంటుంది. ఇక ఈ ఎండాకాలంలో మనుషులే దాహంతో అల్లాడిపోతుంటారు. అలాంటిది మూగ జీవాల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెట్స్ కోసం నీళ్లను కూడా ఉంచండి.. బాల్కనీలో నీళ్లు నింపి పెట్టండి.. అంటూ రష్మీ గత కొన్ని రోజులుగా చెబుతూనే వస్తోంది… తాజాగా అదిరే అభి చేసిన మంచి పనికి రష్మీ ఫిదా అయింది.
థ్యాంక్యూ అభి అని రష్మీ ఆ వీడియోను షేర్ చేసింది. తన అపార్ట్మెంట్ బయట ఇలా తొట్టి పెట్టి నీళ్లు నింపి పెట్టాను అని చెప్పుకొచ్చాడు. మూగ జీవాలకు ఈ సమ్మర్‌లో అది ఉపయోగపడుతుందని అన్నాడు.మొత్తానికి అభి చేసిన మంచి పనికి జనాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆ వీడియోను రష్మీ షేర్ చేసి మరింత మందికి తెలిసేలా చేసింది. థ్యాంక్యూ అభి అంటూ రష్మీ షేర్ చేసిన ఈవీడియో మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు…
View this post on Instagram