Rashmi Gautham : ర‌ష్మీ గౌత‌మ్ ఆవేద‌న‌.. ఆమె పోస్ట్‌కి స్పంద‌న ద‌క్క‌డంతో ఫుల్ హ్యాపీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautham : ర‌ష్మీ గౌత‌మ్ ఆవేద‌న‌.. ఆమె పోస్ట్‌కి స్పంద‌న ద‌క్క‌డంతో ఫుల్ హ్యాపీ

 Authored By sandeep | The Telugu News | Updated on :20 March 2022,9:30 pm

Rashmi Gautham: బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్స్‌లో ర‌ష్మీ గౌత‌మ్ ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ ఒకవైపు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌తో బిజీగా ఉంటూనే సోష‌ల్ స‌ర్వీస్ చేస్తుంటుంది. ముఖ్యంగా సామాజిక అంశాల‌పై స్పందిస్తూ ఉంటుంది. ‘జబర్ధస్త్’ అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఫుల్ ఫేమస్ అయింది. అద్భుతమైన టాలెంట్‌తో పాటు ఆకట్టుకునే అందం ఉండడంతో రష్మీ గౌతమ్ మంచి గుర్తింపును అందుకుంది. దీనికి రెట్టింపు స్థాయిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. ఇక వీధి కుక్కల కోసం రష్మీ ఎంతగానో పాటు పడుతుంది.రోడ్డుపై గాయాలతో పడి ఉండే పెట్స్‌ను కాపాడుతూ ఉంటుంది. అలా వీధుల్లో ఉండే కుక్కల కోసం రష్మీ లాక్డౌన్ సమయంలో ఫుడ్ పెట్టేందుకు రోడ్డు మీదకు వచ్చేసింది. మూగ జీవాల‌ని హింసిస్తే ర‌ష్మీ అస్స‌లు త‌ట్టుకోలేదు.

Rashmi Gautham : ర‌ష్మీ ఆక్రోశం..

హోలీకి ముందు ర‌ష్మీ .. రంగుల‌ని కుక్కల మీద చల్లకండి.. వాటికి ప్రాణాంతకరంగా మారే అవకాశాలు ఉంటాయి అని రష్మీ వేడుకుంది. కానీ కొందరు మాత్రం కావాలనే కుక్కలను హింసించేశారు. కొందరు ఆకతాయిలు కట్టేసి ఉన్న కుక్క మీద రంగులు చల్లారు. కుక్క ఎంత మొత్తుకుంటూ ఉన్నా కూడా వినిపించుకోలేదు. దాని మీద రంగులు చల్లుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ వచ్చారు.ఆక‌తాయిల వేషాల‌పై స్పందించిన ర‌ష్మీ.. వెంటనే వారిని పట్టుకోవాలని, అరెస్ట్ చేయాలని, ఆ కుక్కను కాపాడాలంటూ వేడుకుంది. దీంతో రష్మీ చేసిన అభ్యర్ణనకు నెట్టింట్లో రియాక్షన్ ఫాస్ట్‌గా వచ్చింది. ఆ వ్య‌క్తుల‌ ఆడ్రెస్ కనుక్కుని, వారిని పట్టుకున్నారని రష్మీ చెప్పుకొచ్చింది. ఆ కుక్క మీద రంగులు పోలేదు..

rashmi gautham emotional about dog incident

rashmi gautham emotional about dog incident

దానికి స్నానం కూడా చేయించలేదు.. ఆ రంగుల్లో ఎన్నో రసాయనాలుంటాయి.. వాటి వల్ల చూపు కోల్పోవచ్చు. లేదా ప్రాణం కూడా పోవచ్చు అని రష్మీ ఆవేదన చెందింది. ఆ మ‌ధ్య గేదె, ఆవు పాల మీద స్పందించింది. గేదెలు, ఆవులు తమ పిల్లల కోసం పాలను ఉత్పత్తి చేస్తుంటే.. మనుషులు వాటిని అవసరానికి మించి తీసుకుంటున్నారు. అవి మనషుల కోసం పాలను ఉత్పత్తి చేస్తోన్నట్టు అయింది. వాటిని మనం హింసిస్తున్నామంటూ రష్మీ చెప్పుకొచ్చింది. అందుకే తాను పాలు, పాల ఉత్పత్తులను కూడా వాడను అని తెలిపింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది