Rashmi Gautham : ఆరేంజ్ డ్రెస్ లో ఆక‌ట్టుకుంటున్న ర‌ష్మీ గౌత‌మ్ .. ఫొటోస్ వైర‌ల్

Authored By mallesh | The Telugu News | Published on: June 4, 2022, 7:00 pm

Rashmi Gautham : యాంక‌ర్, న‌టి ర‌ష్మీ గౌత‌మ్ జ‌బ‌ర్ద‌స్త్ తో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. బుల్లితెర‌పై యాంక‌ర్ గా సినిమాల్లో ప‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఈ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఢీ షోలో యాంక‌ర్ గా చేస్తూ మ‌రింత ఫేమ్ సాధించింది. ఈ షోలో అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ వ‌చ్చి రాని తెలుగుతో కామెడీ చేస్తూ క‌ట్టిప‌డేస్తోంది. అలాగే ప‌లు స్పెష‌ల్ ఈవెంట్స్ లో ఆక‌ట్టుకుంటోది. కాగా బుల్లితెర సూప‌ర్ స్టార్ సుడిగాలీ సుధీర్ తో ఎక్కువ‌గా స‌న్నిహిత్యంగా ఉండ‌టం, ప‌లు షోల్లో సుధీర్ ర‌ష్మీని ల‌వ్ చేస్తున్నాన‌ని చెప్ప‌డంతో మ‌రింత పాపుల‌ర్ అయ్యారు ఈ జోడీ.

గ‌తంలో ఓ ఈవెంట్ లో సుధీర్, ర‌ష్మీ పెళ్లి అంద‌రూ ద‌గ్గ‌రుండి చేశారు. దీంతో చాలా మంది ఇది నిజ‌మైన పెళ్లి అనుకుని ఆశ్చ‌ర్య‌పోయారు. కాగా వైజాగ్ లో పుట్టి పెరిగిన‌ ర‌ష్మీ ప‌లు సినిమాల్లో న‌టించి మెప్పించింది. గుంటూర్ టాకీస్ సినిమాలో సువ‌ర్ణ పాత్ర పోషించి సిద్దు జోన్న‌ల‌గ‌డ్డ‌తో రొమాన్స్ చేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రం అంత‌కు మించి సినిమాలో న‌టించింది. అలాగే గ‌తంలో క‌రెంట్, ప్ర‌స్థానం, బిందాస్, గ‌ణేష్, చారుషీలా వంటి సినిమాల్లో మెరిసింది.

Rashmi Gautham orange dress photos viral

Rashmi Gautham orange dress photos viral

కాగా ర‌ష్మీ సోష‌ల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోస్ పోస్ట్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ర‌ష్మీ పోస్ట్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇన్ స్టాలో ఆరేంజ్ క‌ల‌ర్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటోంది. హై హీల్స్ వేసుకుని వంగి మోకాళ్ల‌ను ప‌ట్టుకుంటున్న‌ట్లు ఫోజులిస్తూ మ‌తిపోగొడ‌తోంది. కేవంల కొన్ని గంట‌ల్లోనే ల‌క్ష‌ల్లో లైక్స్ వ‌చ్చి ప‌డ్డాయి. లుకింగ్ బ్యూటిఫుల్.. క్యూట్ ఆల్ టైమ్ అంటూ నెటిజ‌న్లు కామెంట్ల‌తో ప్ర‌శంసిస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp