Rashmi Gautham : బుల్లితెరపై రచ్చ చేసే గ్లామర్ బ్యూటీస్‌లో రష్మీ గౌతమ్ ఒకరు. ఒకప్పుడు సినిమాలతో సందడి చేసిన రష్మీ జబర్ధస్త్ షోతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. వచ్చీ రాని తెలుగు మాటలతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచింది. ఇప్పుడు రష్మీ పబ్లిక్ లోకి వస్తే చాలు, చూడడానికి జనాలు ఎగబడిపోతారు. ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు చేస్తారు. రష్మీ క్రేజ్ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తుందని అందరూ భావించారు. అయితే బుల్లితెర కలిసొచ్చినంతగా ఆమెకు వెండితెర కలిసి రావడం లేదు.
హీరోయిన్ గా పలు ఆఫర్స్ దక్కినా, హిట్ అనేది దక్కలేదు. దీనితో ఆమెకు చిన్నగా అక్కడ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి కాగా, చాలా కాలంగా ఈ చిత్రం బాక్సులకే పరిమితం చేస్తున్నారు. మరోవైపు రష్మీని ఢీ సీజన్ 14 నుండి తొలగించారు. అలాగే సుడిగాలి సుధీర్, జడ్జి పూర్ణ, దీపికా పిల్లిని సైతం తొలగించడం జరిగింది. వీళ్ల సారథ్యంలో షో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. మరి ఢీ నిర్వాహకులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు.
వీరి నిష్క్రమణతో రేటింగ్ కూడా బాగా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.రష్మీకి కనీసం ఐటెం సాంగ్స్ చేసే ఛాన్స్ కూడా రావడం లేదు. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మూవీలో రష్మీ నటిస్తున్నారు.ఇందులో రష్మీ పాత్ర ఏంటనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్ పలు సమస్యలపై స్పందిస్తూనే అప్పుడప్పుడు తన అందచందాలతో అలరిస్తూ ఉంటుంది. తాజాగా క్యూట్ చూపులు చూస్తూ ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఈ అమ్మడి రచ్చకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. ప్రస్తుతం రష్మీ వీడియో వైరల్‌గా మారింది.
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
This website uses cookies.