Home » Entertainment » Rashmi Saddened Sudigali Sudheer Fans Is Relationship Between
Entertainment

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన రష్మీ.. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇదే!

Authored By
mallesh
The Telugu News | Published on: January 29, 2022, 1:30 pm
Advertisement

Sudigali Sudheer : జబర్దస్త్ యాంకర్ రష్మీ, కమెడియన్ కమ్ యాక్టర్ సుడీగాలి సుధీర్ మధ్య ఏదో ఉందని గత కొన్నాళ్లుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అటు సుధీర్ గానీ, ఇటు రష్మీ గానీ ఇన్నాళ్లు క్లారిటీ ఇవ్వలేదు. ఎట్టకేలకు యాంకర్ రష్మీ తామిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి తొలిసారిగా ఓపెన్ అయ్యింది. వారిద్దరి మధ్య ఆన్ స్క్రీన్‌లో జరుగుతున్న రొమాన్స్ పై నిర్మోహమాటంగా సమాధానం చెప్పింది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Advertisement

తాజాగా ఓ తెలుగు చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మీ తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యింది. సుడీగాలి సుధీర్ తాను జబర్దస్త్ లోనే కాకుండా ఢీ వంటి డ్యాన్సింగ్ ప్రొగ్రామ్‌లోనూ కలిసి చేస్తున్నాం. అక్కడ కూడా మా ఇద్దరి మధ్య మంచి ఫన్ అండ్ రొమాన్స్ జనరేట్ అవుతుంది. కానీ అందరూ అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య లవ్ వంటిది ఏమీ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే. ప్రొగ్రామ్ డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా తాము పర్ఫామెన్స్ చేస్తుంటాం అంతే అని క్లారిటీ ఇచ్చింది.

rashmi saddened Sudigali Sudheer fans is relationship between

Advertisement

Sudigali Sudheer : మా ఇద్దరి మధ్య జరిగే రొమాన్స్ ఇదే

గతంలో అనేక సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన రష్మీ.. గుంటూరు టాకీస్‌ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఆ సినిమాలో రష్మీ నటనకు మంచి మార్కులే వచ్చినా సినిమా ఆఫర్లు పెద్దగా రాలేదు. ఆ సినిమాలో  నటిగా కనిపించడమే కారణం అని తెలిసింది. మళ్లీ అటువంటి క్యారెక్టర్స్ వస్తుండటంతో అందులో నటించనని కరాఖండీగా చెప్పినట్టు రష్మీ కుండబద్దలు గొట్టింది. మంచి సినిమాలు వస్తే అందులో నటించడానికి తాను సిద్ధంగా ఉంటానని పేర్కొంది. ప్రస్తుతం చేతి నిండా షోలతో తీరిక లేని జీవితాన్ని గడుపుతోంది యాంకర్ రష్మీ..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి