Rashmika Mandanna and Vijay Devarakonda : మరోసారి కెమెరా కంటికి చిక్కిన విజయ్- రష్మిక.. జిమ్‌కి వెళ్లి వస్తూ.. వీడియో..!
ప్రధానాంశాలు:
Rashmika Mandanna and Vijay Devarakonda : మరోసారి కెమెరా కంటికి చిక్కిన విజయ్- రష్మిక.. జిమ్‌కి వెళ్లి వస్తూ..!
Rashmika Mandanna and Vijay Devarakonda : కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ రష్మిక వ్యవహారం చర్చనీయాంశంగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. వీరిద్దరూ తమ రిలేషన్‌ని కన్పామ్ చేయడం లేదు గానీ.. నేరుగా పెళ్లి ప్రకటన ఇస్తారని అంతా అనుకుంటున్నారు. ఈ ఏడాాదే వీరిద్దరికీ పెళ్లి అవుతుందని కూడా అంటున్నారు. ఆ మధ్య అన్‌స్టాపబుల్‌లో రష్మిక పెళ్లి టాపిక్‌ను బాలయ్య తీయడంతో నెట్టింట్లో మరోసారి రచ్చగా మారింది.
Rashmika Mandanna and Vijay Devarakonda మరోసారి చిక్కారుగా..
తాజాగా వీరిద్దరూ కలిసి మరోసారి కెమెరాకు చిక్కారు. విజయ్- రష్మిక ఇద్దరూ ఒకే జిమ్ నుంచి వెళ్తూ కనిపించారు. విజయ్ కారులోనే రష్మిక వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కూడా ఇద్దరు కలిసి కనిపించారు. ముందుగా రష్మిక అక్కడికి చేరుకొని ఫ్యాన్స్ తో ఫోటోలు దిగింది.
అనంతరం కొద్ది సమయానికే విజయ్ కూడా అక్కడికి వచ్చారు. ఇద్దరు కలిసి క్రిస్మస్ వేడుకల కోసం విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా మారింది. ఈ ఏడాదిలో పెళ్లి పీటలెక్కుతారని అంతా ఫిక్స్ అయ్యారు. మరి ఈ రౌడీ హీరో తన రౌడీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతాడో లేదో చూడాలి. ఇప్పటికి అయితే విజయ్ తన సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మంచి హిట్ కోసం కసిగా పని చేస్తున్నాడు.
మరోసారి కెమెరాకు చిక్కిన విజయ్-రష్మికా
జిమ్ కి వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు కనిపించారు.#VijayDevarakonda #RashmikaMandanna pic.twitter.com/bVatib8wdy
— greatandhra (@greatandhranews) February 5, 2025