Rashmika Mandanna : రష్మిక మందన్నా మరో మార్ఫింగ్ వీడియో వైరల్.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : రష్మిక మందన్నా మరో మార్ఫింగ్ వీడియో వైరల్.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ

Rashmika Mandanna : మొన్ననే కదా.. రష్మిక మందన్నా ముఖంతో ఓ వీడియోను వైరల్ చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో రష్మిక మందన్నా ముఖాన్ని వేరే యువతి శరీరానికి తగిలించారు. అది కొంచెం అసభ్యకరంగా ఉన్న వీడియో. దీంతో ఆ వీడియోలో ఉన్నది నిజంగానే రష్మిక అనుకొని రష్మికపై ఫైర్ అయ్యారు. నువ్వేంటి.. నీ డ్రెస్ ఏంటి.. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి ఈ బుద్ధి ఏంటి అంటూ మండిపడ్డారు. కానీ.. అసలు ఆ వీడియోలో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :10 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  రష్మిక మందన్నా మరో ఫేక్ వీడియో వైరల్

  •  సైబర్ క్రిమినల్స్ రష్మికనే ఎందుకు టార్గెట్ చేశారు?

  •  అది కూడా ఫేక్ అని గుర్తించిన నెటిజన్లు

Rashmika Mandanna : మొన్ననే కదా.. రష్మిక మందన్నా ముఖంతో ఓ వీడియోను వైరల్ చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో రష్మిక మందన్నా ముఖాన్ని వేరే యువతి శరీరానికి తగిలించారు. అది కొంచెం అసభ్యకరంగా ఉన్న వీడియో. దీంతో ఆ వీడియోలో ఉన్నది నిజంగానే రష్మిక అనుకొని రష్మికపై ఫైర్ అయ్యారు. నువ్వేంటి.. నీ డ్రెస్ ఏంటి.. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి ఈ బుద్ధి ఏంటి అంటూ మండిపడ్డారు. కానీ.. అసలు ఆ వీడియోలో ఉన్నది రష్మికనే కాదు. ఆ తర్వాత తెలిసింది అందులో ఉన్నది రష్మిక కాదని.. ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని. ఏది ఏమైనా మార్ఫింగ్ అనేది ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలే ఈ మార్ఫింగ్ దాడికి గురవుతున్నారు. తాజాగా రష్మికకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. అది కూడా మార్ఫింగ్ వీడియోనే. ఎంత చెప్పినా ఈ సైబర్ నేరగాళ్లు మాత్రం అస్సలు ఆపడం లేదు. రెచ్చిపోతూనే ఉన్నారు. మరో వీడియో వైరల్ కావడంతో తన ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీ నివ్వెర పోతోంది.

నిజానికి తన ఫస్ట్ మార్ఫింగ్ వీడియో బయటికి వచ్చినప్పుడే చాలామంది తనకు మద్దతు ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ లాంటి సెలబ్రిటీలు కూడా రష్మికకు మద్దతు ఇచ్చారు. డీప్ ఫేక్ టెక్నాలజీపై చాలామంది పలు రకాలుగా చర్చిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం ఉందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో మళ్లీ రష్మిక వీడియో రావడం సంచలనం సృష్టిస్తోంది. సైబర్ క్రిమినల్స్ ఎందుకు రష్మికనే టార్గెట్ చేస్తున్నారు అనేది అంతుపట్టడం లేదు. ఏది ఏమైనా తనను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ చేయడంపై రష్మిక కూడా స్పందించింది. ఆమె కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనకు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంపై మద్దతు తెలిపారు. రాజకీయ ప్రముఖులు కూడా పబ్లిక్ వేదికలపై మద్దతు తెలిపారు.

Rashmika Mandanna : సినిమాల్లో బిజీ బిజీగా రష్మిక

రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసినట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం తను పుష్ప 2 సినిమాతో పాటు రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న యానిమల్ మూవీలో నటిస్తోంది. తన భవిష్యత్తు ప్రాజెక్టులపై ఇంకా రష్మిక అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఏది ఏమైనా రష్మిక మార్ఫింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నా.. అవి ఫేక్ అని తన అభిమానులు గుర్తుపట్టేసి రష్మికకు తోడుగా నిలుస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది