Rashmika mandanna : రష్మిక మందన్న బాగానే అలవాటు పడింది..!
Rashmika mandanna : రష్మిక మందన్న ఇప్పుడు ఇటు సౌత్ అటు నార్త్ సినిమా ఇండస్ట్రీస్‌లో ఉన్న స్టార్ హీరోయిన్స్‌తో బాగానే పోటీ పడుతోంది. మరో రకంగా చెప్పాలంటే గట్టిగానే పోటీ ఇస్తోంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉందని చెప్పాలి. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా పూజా హెగ్డే్‌తో సమానంగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌లో కనిపించిన రష్మిక బాగానే ఆకట్టుకుంది.

rashmika-mandanna-crazy about south and north movies
ఇక బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తోంది. యంగ్ హీరో సిద్దార్థ్ మల్‌హోత్రా సరసన మిషన్ మజ్ఞు సినిమా చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న గుడ్ బై సినిమా చేస్తున్న రష్మిక .. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూతురు పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాలతో బాలీవుడ్‌లో సెటిలవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది ఈ కన్నడ బ్యూటీ. కాగా ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయాయి.
Rashmika mandanna : సినిమా వాతావరణం ఎక్కడైనా ఒకేలా ఉంటుందని చిలక పలుకులు పలుకుతోంది.

rashmika mandanna crazy about south and north movies
ఇక రీసెంట్‌గా కోలీవుడ్‌లో స్టార్ హీరో కార్తి సరసన సుల్తాన్ సినిమా చేసింది. తమిళంలో డెబ్యూ సినిమా చేసిన రష్మిక మందన్న బాగానే పేరు తెచ్చుకుంది. అయితే సినిమాల పరంగా మూడు ఇండస్ట్రీస్ తనకి సౌకర్యంగానే ఉన్నాయంటోంది. ప్రాంతాలు వేరే తప్ప సినిమా వాతావరణం ఎక్కడైనా ఒకేలా ఉంటుందని చిలక పలుకులు పలుకుతోంది. మొత్తానికి ఇటు సౌత్ అటు నార్త్ ని చుట్టేస్తున్న రష్మిక మందన్న బాగానే అలవాటు పడింది అంటున్నారు.