Rashmika Mandanna : కన్నడ సోయగం రష్మిక మందన్నా ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్రీలను చుట్టిపడేస్తుంది. . ఇటీవల కాలంలో రష్మిక గ్లామర్ డోస్‌పెంచుతున్న రష్మిక కేక పెట్టించే అందాలతోను కైపెక్కిస్తుంది. రష్మిక హీరోయిన్‌గా కాకుండా కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `సీతా రామం`. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన చిత్రమిది. హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాక్యూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సీతారామం చిత్రం ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.
అస్సలు సీత ఎవరనేది తెలుసుకునేందుకు రష్మిక, తరుణ్ భాస్కర్ తమదైన స్టైల్ లో వెతకడం ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. రష్మిక లాంటి పాత్రని సమంత మహానటిలో పోషించింది. అందులో సావిత్రి గురించి తెలుసుకునే పాత్రలో చాలా అమాయకమైన పాత్ర పోషించింది. ఆ పాత్ర సమంతకు మంచి పేరు తెచ్చింది.ఇప్పుడు అదే తరహా పాత్రలో రష్మిక కూడా నటిస్తుంది. ఆమెకు మంచి పేరు వస్తుందని ట్రైలర్ చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో సాఫ్ట్‌గా కనిపించే రష్మిక తర్వాత బాలీవుడ్‌లో స్పైసీ పాత్రలు చేస్తే ఒప్పుకుంటారా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమంతకి అంటే ఆ సినిమా తర్వాత చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 , పుష్ప వంటివి కలిసొచ్చాయి కాని రష్మికకి డౌటే అంటున్నారు.
నేషనల్ క్రష్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక మందన్నా బాలీవుడ్‌లో పాగావేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు భారీ సినిమాల్లో నటిస్తుంది. `మిషన్ మజ్ను`, `గుడ్‌బై` చిత్రాలతోపాటు రణ్ బీర్ కపూర్‌తో కలిసి `యానిమల్` సినిమా చేస్తుంది. ఈ సినిమాలు విజయాలు సాధిస్తే ఇక నార్త్ లోనూ తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. మరోవైపు రష్మిక మందన్నా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక చాలా మారిపోయింది. గ్లామర్ డోస్ పెంచుతూ కనిపిస్తుంది. నార్త్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఒక్కో డోస్ పెంచుతూ పోతుంది క్రష్మిక. అందాల ఆరబోతలో హిందీ భామలకు తక్కువ కాదని చాటుకుంటుంది.
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
This website uses cookies.