Rashmika Mandanna : ఒక రాత్రి స‌రిపోదు.. ఎన్నో రాత్రులు ప‌ట్టింది అంటున్న రష్మిక మందన్నా..!

Authored By aruna | The Telugu News | Updated on: August 4, 2022, 7:00 pm

Rashmika Mandanna : రష్మిక మందన్నా.. ప్రస్తుతం ఈ పేరు వింటేనే కుర్రకారు మొత్తం హోరేత్తిపోతుంది. చిన్న సినిమాల్లో నటించి ఏకంగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది. మాములు సినిమాల నుంచి పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక పెద్ద పెద్ద హిరోలతో సినిమాలకు కమిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో బడా ప్రాజెక్టులు ఉన్నట్టు ఫిలిం వర్గాల టాక్. ఈ బ్యూటీ పేరు ఇప్పుడు తమిళ, కన్నడ, తెలుగు, బాలీవుడ్‌ ఇండస్ట్రీలోనూ మారుమోగుతోంది. రష్మిక అందానికి ఎవ్వరైన ఫిదా కావాల్సిందే.

Rashmika Mandanna : మహేశ్‌తో మెరిసి పుష్పాతో మెప్పించి..

సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేశ్ బాబుతో మెరిసిన రష్మిక.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఛలోతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం అగ్రహీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంది. అనతి కాలంలోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో మూడు ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు ఈ అమ్మడి లక్కును చూసి కుళ్లుకుంటున్నారని టాక్.. తాజాగా ఈ బ్యూటీ తనకు ఇంతటి స్టార్ డమ్‌ రాకముందు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొందో రివీల్ చేసింది. రష్మిక సినిమాల్లోకి రాకముందు పడిన కష్టం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.

Rashmika Mandanna interesting comments on her stardom

Rashmika Mandanna interesting comments on her stardom

‘ఇండస్ట్రీలో నేను రాత్రికి రాత్రి స్టార్ అయిపోలేదు. అదృష్టాన్ని నా వెనక తిప్పుకోలేదు. హీరోయిన్ కావడానికి ఏడు సంవత్సరాలు కష్టపడ్డాను. ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఎన్నో బాధలను దిగమింగుకుని ఇప్పుడు ఈ స్దాయిలో ఉన్నాను. మీరు అనుకున్నట్లుగా నాకు అంతా ఒక్క నైట్‌లో రాలేదు. హీరోయిన్ గా మారాలంటే ఒక్క నైట్ అసలు సరిపోదు. దానికి చాలా ఓర్పు, సహనం, పట్టుదల కూడా కావాలి’అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ మూడు ఇండస్ట్రీల్లో వైరల్ అవుతున్నాయి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp