Rashmika Mandanna : రష్మిక మందన మేకప్ రూమ్ లో ఫ్లై కిస్ ఇచ్చిన వీడియో..!!
Rashmika Mandanna : కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన తెలుగులో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించింది. పుష్ప సినిమాతో నేషనల్ ఇమేజ్ సంపాదించింది. తెలుగులో అవకాశాలు అందుకున్నాక రష్మిక మందన తలరాత పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ వరకు అతి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ గా రష్మిక అవకాశాలతో దూసుకుపోతూ ఉంది.
ఇండియన్ ఐపీఎల్ స్టేజిపై మామూలుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్స్ మాత్రమే పెర్ఫార్మన్స్ ఇస్తారు. కానీ ఈసారి సీజన్ లో గతానికి భిన్నంగా రష్మిక మందన చేత నిర్వాహకులు పెర్ఫార్మన్స్ ఇప్పించటం బట్టి చూస్తే ఆమె పాపులారిటీ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం “పుష్ప 2” తోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉంది. తాజాగా మిషన్ మజ్ను అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని ఫోటోగ్రాఫర్లకు అదిరిపోయే ఫోజులు అవ్వడం జరిగింది.
దానికి ముందు ఓ గోల్డెన్ శారీలో ఎద అందాలతో పాటు… ఎరుపెక్కిన పెదాలతో మేకప్ రూమ్ లో… మేకప్ వేసుకుంటూ.. వీడియో రూపంలో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి ఫ్లై కిస్ ఇవ్వటం జరిగింది. ఈ వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది.