Rashmika Mandanna : స్పెషల్ ప్యాకేజీ..ఢీల్ కుదుర్చుకుంటుందా రష్మిక మందన్న..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : స్పెషల్ ప్యాకేజీ..ఢీల్ కుదుర్చుకుంటుందా రష్మిక మందన్న..?

 Authored By govind | The Telugu News | Updated on :13 May 2022,9:30 pm

Rashmika mandanna : టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే రష్మిక మందన్న అనే చెప్పాలి. ఇటీవల కాలంలో అటు బాలీవుడ్ ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఎక్కడ చూసిన వినిపించిన పేరు పూజా హెగ్డే. కానీ, ఇప్పుడు మారిపోయింది. దానికి కారణం పూజా నటించిన భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటం..రష్మిక మందన్న నటించిన సినిమాలు వరుసగా భారీ హిట్స్ సాధించడమే. పుష్ప సినిమా తర్వాత అమ్మడి క్రేజ్ ఇటు సౌత్‌లోని అన్నీ భాషలలో అటు నార్త్ సినిమా ఇండస్ట్రీలలోని బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. రష్మిక చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలకు పైగానే ఉన్నాయి.

అయితే, రష్మిక గురించి సోషల్ మీడియాలో ఓ లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే అమ్మడు నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటుందనీ. అంటే, ఒకే నిర్మాణ సంస్థలో వరుసగా రెండు మూడు సినిమాలు చేసేందుకు గానూ స్పెషల్ ప్యాకేజీ మాట్లాడుకొని..ఢీల్ సెట్ చేసుకుంటుందట. ఇప్పటికే మైత్రీ వారితో సినిమాలు చేస్తోంది. పుష్ప సీక్వెల్‌తో పాటు మరికొన్ని చిత్రాలలో నటించేందుకు ఒకే చెప్పిందట. అంతేకాదు, ప్రముఖ నిర్మాణసంస్థలు..గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలలో కమిటయిందట.

Rashmika Mandanna Special Package Deal

Rashmika Mandanna Special Package Deal

Rashmika mandanna : ఇప్పటికే గీతా ఆర్ట్స్‌లో రష్మిక గీత గోవిందం సినిమా చేసి హిట్ అందుకుంది.

దిల్ రాజు సంస్థలో ఇప్పుడు తమిళ హీరో విజయ్ సరసన నటించేందుకు సైన్ చేసింది. ఇలానే, బాలీవుడ్‌లో కూడా చైన్ ప్రాజెక్ట్స్ చేసేందుకు రష్మిక సైన్ చేస్తుందట. అక్కడ ఆమె నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండగా..మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో సందీప్ రెడ్డి వంగ – రణ్‌బీర్ కపూర్ కలిసి చేస్తున్న యానిమల్ సినిమాలో కాస్త బోల్డ్ సీన్స్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ దండిగానే ఉంటాయని అంటున్నారు. ఇక రష్మిక కూడా కమిటైన సినిమాను తన వైపు నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తూ కంప్లీట్ చేస్తున్న కారణంగానే ఆమెతో నిర్మాతలు వరుసగా సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారని చెప్పుకుంటున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది