Rashmika Mandanna : కెమెరాలకు మరోసారి చిక్కిన ప్రేమ జంట.. వీకెండ్ డేట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన..!
Rashmika Mandanna : రూమర్డ్ లవర్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన మరోసారి మీడియా కెమెరాలకు చిక్కారు. గత కొంత కాలంగా రౌడీ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరు తాజాగా ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో కలుసుకున్నారు. అక్కడ డిన్నర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, వీరిరువురు వీకెండ్ డేట్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.తాజాగా ముంబైలోని బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో రష్మిక మందన, విజయ్ దేవరకొండ కలిసి డిన్నర్ చేశారు.
ఆ తర్వాత వారు బయటకు వెళ్తున్న క్రమంలో మీడియా వారు వీడియోలు, ఫొటోలు తీశారు. కాగా, ఆ వీడియోలు ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.రెస్టారెంట్ దగ్గర తీసిన వీడియోల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదలు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చొన్నారు. తర్వాత రష్మిక మందన కూడా వచ్చి అదే కారులో బ్యాక్ సీట్‌లో కూర్చొంది.ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు మరో సెలబ్రిటీ లవర్స్ దొరికారని, ఆలియా భట్ – రణ్ బీర్ కపూర్ మాదిరిగా వీరు కూడా పెయిర్‌గా చాలా బాగున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

rashmika mandanna vijay devarkaonda in viral video social media
Rashmika Mandanna : ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ మాదిరిగా వీరి జోడీ..
‘ఓ మైగాడ్ క్రష్మిక, లవ్ కొండ, ప్రేమ జంట సూపర్బ్’ అని పోస్టులు పెడుతున్నారు. అయితే, తమ మధ్య ప్రేమ ఉందని రష్మిక కాని విజయ్ దేవరకొండ కాని అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీరిరువురు గతంలో ‘గీతా గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో జంటగా నటించారు. ఈ సినిమాల్లో వీరి జోడీ సూపర్బ్‌గా కుదిరింది. ఈ క్రమంలోనే ఆన్ స్క్రీన్ జోడీ కాస్త ఆఫ్ స్క్రీన్ కూడా వర్కవుట్ అయిందా? అనే క్వశ్చన్స్ నెటిజన్లు వేస్తున్నారు.
View this post on Instagram