Bigg Boss Telugu 7 : రతిక మళ్లీ టార్గెట్.. ఈసారి చాలామంది నామినేట్ చేసినా సైలెంట్‌గా ఉన్న రతిక.. కారణం అదేనా?

Advertisement

Bigg Boss Telugu 7 : రతిక.. రతిక అంటూ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. నిజానికి రతిక కంటెంట్ కోసం ఎక్కువగా ప్రయత్నిస్తోందని.. ఎప్పుడు చూసినా కూడా కంటెంట్ కావాలని, లేదా ఎవరితోనైనా గొడవ పెట్టుకోవడం, ఊరికే గొడవ పడటం, మొండిగా వ్యవహరించడం, టీఆర్పీ కోసం ప్రయత్నం చేస్తోందని.. ఏ కెమెరాలో చూసినా తనే కనిపించాలనే తాపత్రయం పడుతోందంటూ తోటి కంటెస్టెంట్లు రతిక మీద విమర్శలు చేశారు. నిజానికి రతిక ఈ రెండు వారాలు కూడా చేసింది అదే. తను ఏమాత్రం గేమ్ ఆడకుండా వేరే వాళ్లను డిస్టర్బ్ చేయడం, కావాలని గొడవ పెట్టుకోవడం చేసింది.

Advertisement
rathika nominated again for third week in bigg boss telugu 7
rathikanominations

నామినేషన్లలోనూ రచ్చ రచ్చ చేసింది. ఫస్ట్ వీక్ మొత్తం పల్లవి ప్రశాంత్ ను వెనక్కి తిప్పుకుంది. రెండో వారంలో యావర్ ను పట్టుకుంది. అన్వర్ అంటూ పిలుస్తూ రచ్చ చేసింది. అయితే రెండో వారం వీకెండ్ లో నాగార్జున రతికకు క్లాస్ పీకాడు. నీ కింగ్స్ మీటర్ రెడ్ లో ఉందని.. నువ్వేంటో నిరూపించుకోవాలని సీరియస్ గా క్లాస్ పీకాడు. దీంతో రతిక ఓకే సార్.. నేనేంటో నిరూపిస్తా అని నాగ్ కి మాటిచ్చింది.

Advertisement

Bigg Boss Telugu 7 : నామినేషన్ చేసినా అందుకే సైలెంట్ గా ఉందా?

ఇక.. మూడో వారం నామినేషన్ల ప్రక్రియ హౌస్ లో కొనసాగగా.. ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల ముఖం మీద ఫోమ్ కొట్టాలని చెబుతాడు. అయితే.. ఈసారి కూడా రతికకు బాగానే ఓట్లు పడతాయి. చాలామంది నామినేట్ చేస్తారు. కానీ.. రతిక మాత్రం సైలెంట్ గా ఉండి వాళ్ల నామినేషన్స్ ను యాక్సెప్ట్ చేసింది. నాగార్జున నీ ఆట చూపించు అనేసరికి చాలా మెచ్యూర్డ్ గా ఆడుతోంది. చూద్దాం మూడో వారంలో తన ఆట ఎలా ఉంటుందో?

Advertisement
Advertisement