Ravi teja : మొదటి రెమ్యూనరేషన్‌ను ఎంతంటే.. గుట్టు విప్పిన రవితేజ

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 15, 2021, 4:26 pm

ఎంత పెద్ద హీరో అయినా సరే అతని మొదటి రెమ్యూనరేష్ ఎప్పుడూ గుర్తుంటుంది. అది మానవ సహజం. తాము కష్టపడి సంపాదించిన మొదటి జీతం అందరికీ తీపి గుర్తుగా ఉంటుంది. అలా ఎంతటి వారికైనా సరే ఆ మొదటి జీతం అన్నది ప్రత్యేకమే. తాజాగా రవితేజ తన మొదటి రెమ్యూనరేషన్ గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అది ఏ సందర్భంగా వచ్చింది.. ఆ డబ్బులు చివరకు ఏమయ్యాయో కూడా తెలిపాడు.

Ravi teja about His First Remuneration

Ravi teja about His First Remuneration

Ravi Teja  క్రాక్ సక్సెస్..

రవితేజ మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా, చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అలా నిన్నే పెళ్లాడుతా సినిమాకు రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే చిన్న పాత్రను పోషించాడు. దానికి గానూ మొదటి సారిగా పారితోషికం అందుకున్నాడట. తాజాగా ఆ గుట్టును బయటపెట్టేశాడు. క్రాక్ సక్సెస్ అయిన సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రవితేజ అనేక విషయాలను చెప్పాడు.

రవితేజ నాగార్జున చేతుల మీదుగా..

ఈ క్రమంలోనే తన మొదటి రెమ్యూనరేషన్ గురించి రవితేజ మాట్లాడాడు. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. అందుకుగాను ఓ చెక్‌పై రూ.3500 రాసి.. నాగ్‌ సంతకం చేసి ఇచ్చాడు. అదే నా మొదటి రెమ్యూనరేషన్‌. చాలారోజులపాటు ఆ చెక్‌ను భద్రంగా దాచుకున్నాను. కొంతకాలం తర్వాత అవసరాల రీత్యా డబ్బు కావాల్సిఉండడంతో చెక్‌ను బ్యాంక్‌లో మార్చేశానంటూ తన మొదటి సంపాదన గురించి రవితేజ మాట్లాడాడు.

Cinema Desk

No bio available for this author.

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp