చిన్న బ్రేక్ ఇచ్చా.. ‘క్రాక్’లో రెచ్చిపోయిన రవితేజ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

చిన్న బ్రేక్ ఇచ్చా.. ‘క్రాక్’లో రెచ్చిపోయిన రవితేజ

గోపీచంద్ మలినేని రవితేజ సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడి, కామెడీని ఎక్కడ ఎలా వాడాలో తెలిసిన డైరెక్టర్‌గా గోపీచంద్ మలినేనికి మంచి పేరుంది. డాన్ శీను, బలుపు వంటి హిట్ చిత్రాల తరువాత ఈ ఇద్దరి కాంబోలో వస్తోన్న చిత్రమంటే అందరికీ అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకునేలానే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ కూడా ఉంది. ఇక పాటలతో తమన్ ఇప్పటికే అదరగొట్టేశాడు. ఇవన్నీ […]

 Authored By uday | The Telugu News | Updated on :1 January 2021,11:23 am

గోపీచంద్ మలినేని రవితేజ సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడి, కామెడీని ఎక్కడ ఎలా వాడాలో తెలిసిన డైరెక్టర్‌గా గోపీచంద్ మలినేనికి మంచి పేరుంది. డాన్ శీను, బలుపు వంటి హిట్ చిత్రాల తరువాత ఈ ఇద్దరి కాంబోలో వస్తోన్న చిత్రమంటే అందరికీ అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకునేలానే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ కూడా ఉంది. ఇక పాటలతో తమన్ ఇప్పటికే అదరగొట్టేశాడు.

ఇవన్నీ ఇలా ఉంటే న్యూ ఇయర్ కానుకగా క్రాక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేష్ వాయిస్ ఓవర్ అడిషనల్‌గా అందరినీ ఆకట్టుకుంటోంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అయిన వీర శంకర్‌ను పరిచయం చేస్తూ వెంకీ వేసిన సెటైర్లు, పంచ్‌లు బాగానే ఉన్నాయి. ఇక సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు ఈ సినిమా పెద్ద బలంగా మారేలా కనిపిస్తున్నారు. భయంకరమైన విలనిజాన్ని గోపిచంద్ మలినేని చూపించేందుకు రెడీ అయినట్టున్నాడు,

Ravi Teja Krack Movie Trailer Released

Ravi Teja Krack Movie Trailer Released

అంతే కాకుండా రవితేజలోని మాస్ యాంగిల్‌ను పూర్తిగా బయటకు తీసినట్టు కనిపిస్తోంది. చిన్న బ్రేక్ ఇచ్చా.. ఈ టైంలో ఎన్ని యాడ్స్ వేసుకుంటావో వేసుకో.. ఇంకాసేపు ఆగితే ఏది కోసేస్తానే నాకే తెలియదు.. అంటూ రవితేజ తన మ్యానరిజంలో కొట్టిన డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. రక్తం తాగుతా అంటూ సముద్రఖని తన స్టైల్లో చెప్పిన డైలాగ్, వరలక్ష్మీ విలనిజాన్ని ఓ లెవెల్‌లో పండించారు. ఇక శ్రుతీ హాసన్ రవితేజల రొమాన్స్ కూడా ఫుల్ క్లిక్ అయ్యేలానే ఉంది. రవితేజ సంక్రాంతి బరిలోకి దిగి ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది