Ravi Teja remuneration matter
Ravi Teja : ఇటీవల ‘ ధమాకా ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజ్ రవితేజ ‘ రావణాసుర ‘ సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూపోతున్నారు. అందుకే టాలీవుడ్లో ఏడాదికి మూడు సినిమాలు తక్కువ కాకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఏకైక హీరోగా రవితేజ ఉన్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో హిట్ కొట్టిన రవితేజ రావణాసుర సినిమాతో డీలా పడిపోయారు. ఈ సినిమా ఫలితం కారణంగా నిర్మాతలు రవితేజ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు.
Ravi Teja remuneration matter
ఈ క్రమంలోనే రవితేజ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని రవితేజ నమ్ముతున్నాడు. ఈ సినిమా హిట్ అయితే కనుక రవితేజకి పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పెరుగుతుంది. దీనికోసం రవితేజ చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంత టైగర్ నాగేశ్వరరావు పైనే పెట్టారని తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని భాషలలో స్టార్ నటులతో వాయిస్ ఓవర్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ లైఫ్ రాబిన్ హుడ్ గా పేరుపొందిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
Hero Ravi Teja is the worst decision
వంశీకృష్ణ ఆకెళ్ళ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో రవితేజ కెరీర్ లోనే ఎన్నడూ లేనివిధంగా అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాతో రేణు దేశాయ్ నటిగా రిఎంట్రి ఇస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ నటిస్తుంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ కి పరిచయం కాబోతోంది. ఈమె బాలీవుడ్ లో గాయనిగా, నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇక టాలీవుడ్లోకి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఏంట్రీ ఇవ్వబోతుంది. ఇక రవితేజ రావణాసుర కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో ఎప్పటిలాగే మాస్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నాడు.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.