Ram charan : మొదటిసారిగా అలా.. రామ్ చరణ్-శంకర్ స్టోరీ లీక్
Ram charan : ఇండియన్ డైరెక్టర్ శంకర్ సినిమాలంటే అందరికీ ఓ మాదిరిగా అంచనాలుంటాయి. ఊహకందని మాయాజాలం, విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ పరంగా సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని అందరూ భావిస్తారు. శంకర్ కూడా హాలీవుడ్ స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. అక్కడి నిపుణులనే శంకర్ ఆశ్రయిస్తుంటాడు. అయితే ఈ సారి మాత్రం శంకర్ తన పంథాను మార్చుకుని మొదటిసారిగా కొత్తగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Ram charan : రామ్ చరణ్-శంకర్ స్టోరీ లీక్

RC15 Ram charan Shankar story leaked
దిల్ రాజు నిర్మాణంలో రాబోతోన్న సినిమాకు రామ్ చరణ్‌ను అదిరిపోయే పాత్రలో చూపించబోతోన్నట్టు టాక్. పైగా ఇది సమకాలీన రాజకీయ అంశాలను ఎత్తిచూపేలా ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అంతలా అవసరం ఉండవని కూడా టాక్. అయితే శంకర్ స్థాయికి తగ్గట్టుగా భారీ భారీ నిర్మాణాలు, సెట్స్ వేయాల్సి ఉంటుందట. ఇందు కోసం బాగానే ఖర్చు పెట్టబోతోన్నట్టు తెలుస్తోంది.
రాజకీయాల చుట్టూ తిరుగుతూనే కమర్షియల్ అంశాలను టచ్ చేస్తూ సాగే ఈ సినిమాకు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేశాడట శంకర్. యువ సంగీత సంచలనం అనిరుధ్ ఈ మూవీకి సంగీతాన్ని అందించబోతోన్నాడట. మొదటిసారిగా శంకర్‌ను కాదనుకుని వేరే సంగీత దర్శకుడితో శంకర్ పని చేయబోతోన్నాడు. ఇక ఈ సినిమా మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త రికార్డులను క్రియేట్ చేసేలానే ఉంది.