ram charan : బాక్సాఫీస్ రికార్డ్‌లు బద్దలే.. రామ్ చరణ్-శంకర్ కాంబో
ram charan : ఓ సినిమా మొదలెట్టకముందే.. అసలు ప్రాజెక్ట్ ఉందా? లేదా? అనే మీమాంసలో ఉండగా.. చిత్రంపై ఇంతటి అంచనాలు రేకెత్తడం, నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. రామ్ చరణ్ 15వ సినిమా ప్రకటన గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆ మూవీ నుంచి బయటకు రాబోతోన్నాడు. అందుకే ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌పై శ్రద్ద పెట్టినట్టున్నాడు.

ram charan shankar Project Announcement
ఈ క్రమంలో తన 15వ చిత్రాన్ని చకచకా పట్టాలెక్కించాలని చూస్తున్నట్టున్నాడు. అందుకే రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. శంకర్ దర్శకత్వంతో రామ్ చరణ్ చేయబోతోన్నాడు.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చెర్రీ సినిమా ఉంటుందని రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
ram charan : రామ్ చరణ్ – శంకర్ కాంబో
ఇన్ని రోజులుగా వచ్చిన రూమర్లే నేడు నిజమయ్యాయి. దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఫిక్స్ అయింది. ఇది నిజంగా ఇండియన్ బాక్సాఫీస్‌ను దడదడలాడించేందుకు వచ్చినట్టుగానే ఉంది. శంకర్ రెహమాన్ రామ్ చరణ్ ఇలా ఒకే వరుసలో పేర్లు చదువుతుంటూనే అందరికీ పూనకాలు వచ్చేస్తున్నాయి. ఇక ఈ సినిమా తెరపైకి వచ్చే సమయానికి ఇండియాలో బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలయ్యేలా కనిపిస్తోంది.