పుష్ప లో ఐటెం బ్యూటీకి కోటైనా ఖర్చు పెట్టానికి రెడీ ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

పుష్ప లో ఐటెం బ్యూటీకి కోటైనా ఖర్చు పెట్టానికి రెడీ ..?

పుష్ప .. అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ ఫస్ట్ టైం కంప్లీట్ కల్ట్ కంటెంట్ ఉన్న స్టోరీలో నటిస్తున్నాడు. ఇక రష్మిక మందన్న ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రెండు సినిమాలు క్లాస్ హిట్స్ గా నిలిచాయి. […]

 Authored By govind | The Telugu News | Updated on :2 January 2021,10:50 am

పుష్ప .. అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ ఫస్ట్ టైం కంప్లీట్ కల్ట్ కంటెంట్ ఉన్న స్టోరీలో నటిస్తున్నాడు. ఇక రష్మిక మందన్న ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రెండు సినిమాలు క్లాస్ హిట్స్ గా నిలిచాయి. కాని పుష్ప మాత్రం ఆ రెండు సినిమాలకి పూర్తి భిన్నంగా తెరకెక్కుతోంది.

Allu Arjun Pushpa setting with Mahabubnagar - tollywood

అల్లు అర్జున్ .. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ రికార్డ్ సాధించిన సినిమా తర్వాత వస్తున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే పుష్ప సినిమా మీద బాలీవుడ్ లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ కంపోజ్ చేస్తున్నాడు దేవీశ్రీప్రసాద్. దేవీశ్రీప్రసాద్ కంపోజ్ చేసే ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేస్తుంటుందన్న సంగతి తెలిసిందే.

Pushpa Makers In Dilemma Over Disha Patani Remuneration For It Song?

అయితే ఇప్పుడు రాబోతున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ నెవెర్ బిఫోర్ అన్నట్టుగా దేవీశ్రీప్రసాద్ తయారు చేస్తున్నాడట. ఇక ఈ ఐటెం సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసెందుకు గత కొన్ని రోజులుగా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రముఖంగా ఊర్వశీ రౌతెల, దిశా పఠాని పేర్లు ఎక్కువగా ప్రచారంలో నిలిచాయి. కాగా దిశా పఠాని ని ఫైనల్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ హాట్ బ్యూటికి ఏకంగా కోటి రూపాయలు ముట్టచెబుతున్నారట. మరి ఇంత కాస్ట్లీ ఐటెం సమగ్ ఎలా ఉంటుందో చూడాలి.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది