Sr NTR : సీనియర్ ఎన్టీఆర్ నిర్మాతగా మారడం వెనక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా?
Sr NTR : తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న హీరో నందమూరి తారకరామారావు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా పలు రంగాలలో ఆయన సత్తా చాటారు. ఏ పాత్రలోనైన ఇట్టే ఇమిడిపోయే ఎన్టీఆర్ దేవుడి పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పటికి కొన్ని ఇళ్లలో దేవుడి ఫొటోలుగా ఎన్టీఆర్ ఫొటోలే ఉంటాయి. అంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం ఏర్పాటు చేసుకున్న అన్నగారు తనకు నచ్చడం వల్లే..చేసిన పాత్రలు కొన్ని అయితే.. తెరవెనుక నిర్మాతగా ఉంటూ.. దర్శకుడిగా కూడా రాణించడం వెనుక.. మరికొందరి ప్రోద్బలం.. ప్రోత్సాహం వంటివి ఉన్నాయి. సినిమాలపై ఉన్న అమితమైన ప్రేమతో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీ రామారావు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. తనదైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్నారు. టాలెంట్ తో పాటు క్రమశిక్షణ ఉండటం వల్లనే ఎన్టీఆర్ ఆ స్థాయికి చేరుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇక ఎన్టీఆర్ కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించిన సంగతి తెలిసిందే.
ప్రతి ఒక్కరి తో కలుపుగోలుతనం… స్నేహితులకు ఎవరికైనా సమస్య వస్తే అండగా ఉండే మంచితనం.ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో అన్ని ఎంతో ప్రత్యేకం. హిస్టరీలోనే అన్నగారు నిర్మాతగా మారడానికి కారణం ఉంది. తన సోదరుడు.. త్రివిక్రమరావు.. ఎడిటర్‌గా.. సంగీత పర్యవేక్షకుడిగా పనిచేసేవారు. అన్నగారు నటించి.. దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమాకు.. త్రివిక్రమరావే నిర్మాత. అయితే.. అనుకున్న విధంగా ఈ సినిమాకు బడ్జెట్ సరిపోలేదు. దీంతోత్రివిక్రమ రావు.. అధిక వడ్డీకి.. వాహినీ సంస్థ నుంచి అప్పు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఆ సంస్థ తాము అప్పుగా ఇవ్వబోమని.. సహ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటామని.. చెప్పింది. అలా చేస్తే సినిమాలో వచ్చే వాటాలో వారు పెట్టిన పెట్టుబడికి తగిన విధంగా ఆదాయం ఇవ్వాల్సి ఉంటుం ది. అయితే.. దీనికి తొలుత త్రివిక్రమరావు అంగీకరించలేదు. కానీ, సినిమా షూటింగ్ ఆగిపోతే.. అప్పటికే పెట్టిన పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అలాగని..
అన్నగారికి చెప్పలేరు. డబ్బులు చూసుకో కుండా.. ఎందుకు మొదలు పెట్టావ్! అని ఆగ్రహించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ రావు.. తర్జన భర్జన పడ్డారు. వారి నోట వీరి నోట ఈ విషయం ఎన్టీఆర్‌కి తెలిసింది. దీంతో . దీంతో ఆయన త్రివిక్రమరావుకు డబ్బులు సర్దుబాటు చేసేలా.. వాహిని స్టూడియోతో ఒప్పించారు. అయితే.. అప్పుగానే సొమ్ములు ఇచ్చేలా మాట్లాడారు. ఇక, ఆ సినిమా హిట్‌కావడంతో.. వాహిని అప్పును తీర్చేశారు. ఇక ఆ తర్వాత నుంచి తమ్ముడు ఏ సినిమా తీసినా.. నిర్మాతగా.. తనే ఉండేవారు. మొదట్లో నిర్మాత: త్రివిక్రమ రావు అని వేసుకునేవారు. కానీ, తర్వాత ఒకటి రెండు సినిమాలకు మాత్రం.. రామారావు పేరు వేసుకున్నారు. ఇదీ.. అన్నగారు నిర్మాతగా మారడానికి దారితీసిన పరిస్థితి. దర్శకుడిగాను ఎన్టీఆర్ పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తీసారు. సినీ రంగంలో నందమూరి తారక రామారావు అడుగుపెట్టిన తరువాత తెలుగు సినిమా రంగాన్ని భారతీయ సినిమా తలెత్తి చూసిందని..
ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, తెలుగు సంస్కృతి తలెత్తి నిలబడిందని బాలయ్య ఇటీవల పేర్కొన్నారు. ఇక మే 28వ తేదీ నుండి 2023 మే 28 వరకు, 365 రోజుల పాటు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని.. ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులు అందరూ హాజరవుతారని ఆయన తెలిపారు. తెలుగు ప్రజల శక్తి, యుక్తి తెలుగు తేజం, ఆరాధ్య దైవం అయిన ఎన్టీఆర్ రేపటి తరమే కాదు, తరతరాలు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడు అని చంద్రబాబు అన్నారు. ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ పేరుని స్మరిస్తూనే ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే వారిలో ఎన్టీఆర్ తప్పక ఉంటారు. ఈ తరం ఆ తరం అనే బేధం లేకుండా ఎన్టీఆర్ ఎప్పటికి ఓ అధ్యాయంగా మిగిలిపోతారు. ఇప్పటికే ఎన్టీఆర్ జీవితంపై బయోపిక్స్ రూపొందాయి. ఇవి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.