Anchor Ravi : ప్రస్తుతం తెలుగులో బుల్లితెరపై అదరగొడుతున్న ఫేమస్ యాంకర్స్ లో రవి ఒకరు. ఇన్నాళ్లు యాంకర్‌గా అలరించిన రవి సీజన్ 5లో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. టైటిల్ విన్నర్ అవుతాడని అందరు ఊహించిన, అనుకోని కారణాల వలన బయటకు రావలసి వచ్చింది. అయితే యాంకర్ రవికి బిగ్ బాస్ ఇంట్లో గుంటనక్క అనే పేరు వచ్చింది… నటరాజ్ మాస్టర్ మొదట్లోనే పెట్టిన ఈ పేరు షో చివరి వరకు కంటిన్యూ అయింది. ఇక ఇంఫ్లూయెన్సర్ అంటూ రవిని అందరూ టార్గెట్ చేస్తుండేవారు. బిగ్ బాస్ ఇంట్లో రవి చెప్పిన అబద్దాలు, మాటలు మార్చిన విధానం అన్నీ కలిసి నెగెటివ్ ఇమేజ్‌ను తీసుకొచ్చాయి. లహరి, ప్రియ విషయంలో రవి అడ్డంగా బుక్కయ్యాడు. అమ్మ మీద ఒట్టు అంటూ అబద్దాలు చెప్పడం కూడా రవి ఇమేజ్ డ్యామేజ్ చేశాయి.బయటకు వచ్చాక బిగ్ బాస్ ఎఫెక్ట్ రవిపై బాగానే పడుతుంది. ఇటీవల ఓ నెటిజన్..
రవిని నేరుగా నువ్ ఫేక్ అనిపిస్తావ్ అని చెప్పేశాడు. దీనికి రవి కూల్‌గా రిప్లై ఇచ్చాడు. సరే అది మీ అభిప్రాయం…. దాని పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. ఇలా ఒకరిని జడ్జ్ చేస్తున్నారంటే వాళ్లే వీక్ పర్సన్ అన్నట్టు.. జనాలు నన్ను జీరో అన్నా హీరో అన్నా.. నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను..అని చెప్పుకొచ్చాడు. మరో నెటిజన్ బిగ్ బాస్ షోలో మిమ్మల్ని చూడక ముందు మీ మీద ఎక్కువగా నెగెటివిటీతోనే ఉండేవాళ్లం కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దీనికి రవి స్పందించాడు. అబ్బా ఇది చాలు.. బిగ్ బాస్ ఆఫర్‌ను అంగీకరించేందుకు ఇది ఒక ముఖ్యమైన కారణం. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని రవి చెప్పుకొచ్చాడు.రవి టాప్ 5లో ఉంటాడని ప్రతీ ఒక్కరూ బలంగా నమ్మారు.
కానీ చివరకు రవికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే బయటకు వచ్చిన తర్వాత రవి మాత్రం ట్రోలర్లు, రివ్యూలు చెప్పినవారు, నెగెటివ్ కామెంట్లు చేసిన వారి పని పట్టేందుకు రెడీ అయ్యాడు. ఒక్కొక్కరిపై చెలరేగుతూ వచ్చాడు. ప్రతి ఒక్కరిని చీల్చి చెండాడాడు కూడా. సిరిపై ట్రోల్స్ వచ్చినప్పుడు కూడా స్పందించాడు. ‘ఎవరినీ ఏమనకండి. మరీ ముఖ్యంగా సిరిని ఏమనకండి. మంచిగా చెప్తున్నా, జాగ్రత్త! హెచ్చరికల వైపు కూడా పోవట్లేదు…. దయచేసి నెగెటివ్ కామెంట్లు చేయడం మానేయండి. షణ్ను బాగానే ఉన్నాడు. త్వరలోనే అతడితో మాట్లాడి వీడియో కూడా చేస్తాను’ అని అప్పట్లో చెప్పుకొచ్చాడు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.