Khadgam : ఖ‌డ్గం నుండి వెంక‌టేష్‌, నాగార్జున త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Khadgam : ఖ‌డ్గం నుండి వెంక‌టేష్‌, నాగార్జున త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ఏంటి?

 Authored By sandeep | The Telugu News | Updated on :30 October 2022,7:00 pm

Khadgam : స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ అప్పట్లో ఎంత‌ సెన్సెషన్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేశభక్తి కథాంశంగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, కీలక పాత్రలు పోషించగా.. సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు. దేశభక్తి గురించి తెరకెక్కించిన కొన్ని సీన్లు అప్పట్లో ఓ రేంజ్‌లో హైలెట్ అయ్యాయి. ఈ సినిమా పాటలు ఇప్పటికీ సినీ లవర్స్ చెవుల్లో మార్మోమోగుతూనే ఉంటాయనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద వివాదాస్ప‌దంగా కూడా మారింది. చిత్రంలో పాతబస్తీలో ఉండేవారిని తీవ్రవాదులుగా చూపించడం..

టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చేవారిలా చూపించడంపై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి ముస్లిం మతస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..  థియేటర్లపై కూడా దాడులు కూడా చేశారు. ఖడ్గం మూవీ విడుదలైన తర్వాత కృష్ణవంశీ ప్రాణభయంతో వారంరోజులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారని టాక్ కూడా నడిచింది. అస‌లు ఇలాంటి సినిమాని తెరకెక్కించేందుకు అప్పట్లో ఏ దర్శకుడు కూడా సాహసం చేసే వారు కాదు. 2002 వ సంవత్సరం నవంబర్ 29న ఈ చిత్రం విడుదలైంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. రవితేజ అప్పటికే 3 హిట్లు కొట్టి మంచి ఫామ్లో ఉండడంతో ఈ సినిమాకి అతని క్రేజ్ మరింతగా యాడ్ అయ్యిందనే చెప్పాలి. ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లు కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు.

Reason for Venkatesh and Nagarjuna to fall from Khadgam

Reason for Venkatesh and Nagarjuna to fall from Khadgam

Khadgam : అస‌లు క‌థ ఇది…

అంతా బానే ఉంది కానీ ఈ చిత్రంలో శ్రీకాంత్ పాత్రకి వెంకటేష్ లేదా నాగార్జునలని తీసుకోవాలని ముందుగా నిర్మాత అనుకున్నారట. కానీ వాళ్ళు బిజీగా ఉండడంతో శ్రీకాంత్ ను ఫైన‌ల్ చేశారు. అయితే సెట్స్ పైకి వెళ్లే కొద్దిరోజుల ముందు కూడా నిర్మాత సుంకర మధు మురళి.. ‘శ్రీకాంత్ కు బదులు వేరే హీరోని తీసుకుందాం… అందుకు రూ.1 కోటి బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు’ అని దర్శకుడు కృష్ణవంశీతో డిస్క‌ష‌న్ చేశాడ‌ట‌. అయితే కృష్ణ వంశీ మాత్రం స‌సేమీరా అన్నాడ‌ట‌. నేను శ్రీకాంత్ ను దృష్టిలో పెట్టుకుని పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్నాను.ఇప్పుడు మీరు అత‌న్ని వద్దు అంటే కనుక నేను కూడా ఇంకో నిర్మాతని చూసుకుంటాను’ అని తేల్చి చెప్పేశాడట. అలా అది శ్రీకాంత్ చేయడం ‘ఖడ్గం’ సూపర్ హిట్ అవ్వడం… అటు తర్వాత శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళాం ఊరెళితే’ ‘ఒట్టేసి చెబుతున్నా’ వంటి సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ కావ‌డంతో అత‌ను స్టార్ హీరోగా మారాడు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది