
Nayanthara : ప్రభుదేవాని నయనతార వదిలేయడానికి కారణం ఇదా.. ఇన్నాళ్లకి బయటకి వచ్చిన నిజం..!
Nayanthara : ఇప్పటికే సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తుంది నయనతార. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. అయితే ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశం అయంది. నయనతార కోసం ప్రభుదేవా తన భార్య రమలతకు విడాకులు ఇచ్చేశాడు. అప్పట్లో ఈ మ్యాటర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక రేపో మాపో ప్రభుదేవా, నయనతార మూడు ముళ్ళ బంధంతో ఒకటి అవుతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రభుదేవా, నయనతార బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నకు కొన్ని కారణాలు ప్రధానంగా వినిపించాయి. శింబుకు దూరమైన నయనతార పెళ్ళైన హీరో ప్రభుదేవాకు దగ్గరైంది. కొరియోగ్రఫీ, డైరెక్షన్ లో కూడా రాణిస్తున్న ప్రభుదేవాను నయనతార ఇష్టపడింది. 2009లో వీరు రిలేషన్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అనంతరం ఇద్దరూ ఓపెన్ అయ్యారు. కలిసి సినిమా వేడుకలకు హాజరయ్యేవారు. విందులు, విహారాల్లో పాల్గొంటూ మీడియాకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.
Nayanthara : ప్రభుదేవాని నయనతార వదిలేయడానికి కారణం ఇదా.. ఇన్నాళ్లకి బయటకి వచ్చిన నిజం..!
ప్రభుదేవాకు నయనతార ఎందుకు దూరమైందనే విషయంలో ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ లేదు. ఎట్టకేలకు అందుకు కారణాలు బయటకు వచ్చాయి. నయనతారకు ప్రభుదేవా కొన్ని కఠిన ఆంక్షలు విధించాడట.అవి నచ్చని నయనతార విడిపోవాలని నిర్ణయం తీసుకుందట. నయనతారకు ప్రభుదేవా పెట్టిన కండిషన్లే కొంపముంచాయని కోలీవుడ్ లో బలంగా టాక్ నడిచింది. క్రిస్టియన్ గా ఉన్న నయనతారను ప్రభుదేవా తన మతంలోకి మారాలని కోరాడట. అందుకు నయన్ ఒప్పుకుందట. అలాగే పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని.. హౌస్ వైఫ్ గా మారిపోవాలని ప్రభుదేవా కండీషన్ పెట్టాడట. అయితే అందుకు మాత్రం నయనతార ఒప్పుకోలేదు. మ్యారేజ్ తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగిస్తానని.. కావాలంటే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటానని నచ్చజెప్పే ప్రయత్నం చేసిందట. పెళ్లికి ముందే ఆదిపత్యం చలాయించడం స్టార్ట్ చేశాడట. ప్రభుదేవా తీరుకు విసుగు చెందిన నయనతార.. అతనితో బ్రేకప్ చెప్పిందనే ప్రచారం నడుస్తుంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్‌టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
This website uses cookies.