Kantara Movie : కాంతారాకి అమ్మ మొగుడు లాంటి సినిమా మొన్ననే వచ్చింది తెలుగులో.. కానీ మనోళ్ళు ఫ్లాప్ చేశారు..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 4 December 2022, 9:40 pm

Kantara Movie : ఏ సినిమా అయినా సరే.. అది విడుదల అయ్యాక హిట్ అవుతుందా? లేక ఫ్లాప్ అవుతుందా అనేది ముందే ఊహించడం కష్టం. కొన్ని సినిమాలు ఎన్నో అంచనాల మధ్య విడుదల అవుతాయి. సినిమా విడుదలకు ముందే చాలా హైప్ వస్తుంది. కానీ.. చివరకు సినిమా తుస్ మంటుంది. సినిమా ఫ్లాప్ అవుతుంది. కానీ.. కొన్ని సినిమాలు విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు ఉండవు. చివరకు విడుదల అయ్యాక అంచనాలను దాటి మరీ అవి సూపర్ డూపర్ హిట్ అవుతాయి.అందులో కాంతారా లాంటి సినిమా ఒకటి.

అసలు ఆ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయి రచ్చ రచ్చ చేసింది. బాక్సాఫీసు వద్దు రికార్డులు సృష్టించింది. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు పోటీ ఇచ్చిందంటే కాంతారా సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. అచ్చం కాంతారా లాంటి స్టోరీతోనే తెలుగులో ఇప్పటికే ఆకాశవాణి అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ సినిమాను రాజమౌళి శిష్యుడు రూపొందించాడు. ఆకాశవాణి పేరుతో వచ్చిన ఆ సినిమా సెప్టెంబర్ 24, 2021నే ఓటీటీలో రిలీజ్ చేశారు.

recently telugu movie released like Kantara Movie

recently telugu movie released like Kantara Movie

Kantara Movie : ఆకాశవాణి సినిమాను రూపొందించింది రాజమౌళి శిష్యుడే

రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఆ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే.. ఆ సినిమాలో నటించింది అంతా కొత్త వారే కావడం, విడుదలయింది కూడా సోనీ లివ్ అనే ఓటీటీ కావడంతో ఆ సినిమా అంతగా ప్రేక్షకుల చెంతకు చేరలేదు. సోనీ లివ్ కాకుండా పేరున్న ఓటీటీలో సినిమా రిలీజ్ అయి ఉంటే బాగుండేది. దానికి రీచ్ పెరిగి ఉండేది. కాకపోతే సోనీ లివ్ లో ఆ సినిమాకు ఎక్కువ వ్యూసే వచ్చాయి. కాంతారాకు దీటుగా వచ్చిన ఆ సినిమాను చూడాలంటే మీరు కూడా వెంటనే సోనీ లివ్ ఓటీటీలోకి వెళ్లి చూసేయండి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp