Kantara Movie : కాంతారా ‘ సినిమాలో వరాహ రూపం పాట పాడిన అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు .. వీడియో
Kantara Movie : ఇటీవల వచ్చిన కాంతారా సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందింది. ఈ సినిమా అంతలి హిట్ అవ్వడానికి ముఖ్య కారణం వరాహ రూపం పాట. ఈ మధ్యకాలంలో సినిమాలలో ఒరిజినల్ సాంగ్స్ కి కవర్ సాంగ్స్ చేయడం మామూలే. అయితే కాంతారా సినిమాలోని వరాహ రూపం పాట అనే కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తో రీ క్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది. దీంతో ఆ పాట విన్న వారంతా సింగర్ ఎవరని వెతకడం ప్రారంభించారు. తెలుగు బుల్లితెరపై ఎన్నో సింగింగ్ కాంపిటీషన్స్ లో తన ప్రతిభను చాటిన సింగర్ శ్రీలలిత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.
ఎందుకంటే అంతకుముందు బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా, స్వరాభిషేకం, స్వర నీరాజనం, సరిగమప లిటిల్ చాంప్స్ లాంటి ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే అప్పుడు లిటిల్ చాంప్ కదా అని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల కాంతార సినిమాలోని పాపులర్ సాంగ్ అయినా వరాహ రూపం పాటను ఒక్క కవర్ సాంగ్ చేసి ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. అది కూడా కజు అనే డిఫరెంట్ సంగీత వాయిద్యంతో పూర్తి పాటను రీ క్రియేట్ చేసి ట్రెండ్ సృష్టించింది. కాంతారా సినిమా గురించి అందులోని వరాహ రూపం పాట గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ పాటే సినిమాకు సగం బలం అని చెప్పవచ్చు. అలాంటి పాటను కేవలం కజు అనే మౌత్ ఇన్స్ట్రుమెంట్ తో అద్భుతంగా సింగింగ్ చేయడం విశేషం. కాంతారా ఒరిజినల్ సాంగ్ మేల్ సింగర్ పాడారు. కానీ రీ క్రియేషన్ లో శ్రీ లలిత అందరికీ కజు ఇన్స్ట్రుమెంట్ ని పరిచయం చేస్తూ అద్భుతంగా పాడింది. ప్రస్తుతం శ్రీ లలిత పాడిన వరాహ రూపం సాంగ్ సోషల్ మీడియాలో గొప్ప ఆదరణను పొందుతుంది. అలాగే సింగర్ గా శ్రీ లలితకు తెలుగులో పాటు కన్నడ, తమిళ ఇండస్ట్రీ ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం విశేషం అని చెప్పాలి. తాజాగా శ్రీలలిత సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వరాహ రూపం పాటను పర్ఫార్మ్ చేసింది. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.