Regina Cassandra : రెచ్చిపోయి మరీ చిరంజీవితో చిందేసిన రెజీనా కసాండ్ర.. ‘శానా కష్టపడ్డ’ భామ.. వీడియో
Regina Cassandra : సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు చిరంజీవి. టాలీవుడ్ మెగాస్టార్‌గా ఆయనకున్న స్థానం ప్రత్యేకమైననది చెప్పొచ్చు. చిరంజీవి కొద్ది కాలం పాటు రాజకీయాల్లోకి వెళ్లారు. కాగా, ‘ఖైదీ నెం.150’తో సినీ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ప్రజెంట్ వరుస సినిమాలకు ఓకే చెప్తున్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ ఫిల్మ్ వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ షురూ అయ్యాయి.‘ఆచార్య’ చిత్రం నుంచి ఇప్పటికే ‘లాహే లాహే, నీలాంబరి’ పాటలు విడుదలయ్యాయి. ‘ఆచార్య, సిద్ధ’ టీజర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ సినీ అభిమానులను అకట్టుకోవడంతో పాటు సినిమాపైన ఎక్స్ పెక్టేషన్స్‌ను ఇంకా పెంచేశాయి. కాగా, తాజాగా ‘ఆచార్య’ పిక్చర్ నుంచి ‘శానా కష్టం వచ్చేసిందే మందాకిని’అనే పాట ప్రోమో విడుదల చేశారు.
Regina Cassandra : రెజీనా నడుము మడతలో జనం ఊగిపోవాల్సిందే..!

regina cassandra Item song in Chiranjeevi acharya Movie
అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సదరు పాటలో చిరు గ్రేస్ ఫుల్ స్టెప్స్, యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ చూసి మెగా అభిమానులు ఫిదా అయిపోతున్నారు. చిరుతో స్టెప్స్ వేసే క్రమంలో రెజీనా రెచ్చిపోయిందని అభిమానులు అంటున్నారు. అందాలో ఆరబోతలోనూ రెజీనా అడ్డు చెప్పలేదని పాట ప్రోమో చూస్తుంటే అర్థమవుతున్నదని పేర్కొంటున్నారు. ఇకపోతే రెజీనా కసాండ్రా ఇప్పటికే హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. నెగెటివ్ క్యారెక్టర్స్ కూడా ప్లే చేసిన ఈ భామ..తాజాగా మెగాస్టార్ కోసం.. స్పెషల్ సాంగ్ చేసేసింది. ఇందులో తన క్లీవెజ్, నడుము అందాలు చూపి కుర్రకారును రెచ్చగొడుతోంది.
ఇక ఈ పాట పూర్తిగా సోమవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల కానుంది. ఈ పాటతో రెజీనా కెరీర్ గాడీలో పడుతుందని మెగా అభిమానులు చెప్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆయనకు జోడీగా బ్యూటిఫుల్ పూజా హెగ్డే నటిస్తుండగా, మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
