Taraka Ratna : తారకరత్న కీ విజయసాయి రెడ్డి కీ మధ్య ఉన్న బంధుత్వం ఏంటో మీకు తెలుసా !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 30 January 2023, 8:40 pm

Taraka Ratna : ప్రస్తుతం నందమూరి తారకరత్న గురించి న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. చిత్తూరు జిల్లా శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ కు మద్దతుగా నందమూరి తారకరత్న ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే కొద్ది నిమిషాల్లో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.

relati0n between Taraka Ratna and Vijaya Sai Reddy

relati0n between Taraka Ratna and Vijaya Sai Reddy

దీంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ పది మంది ప్రత్యేకమైన డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోని తారకరత్నకు సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఆయన ఎంపీ విజయసాయిరెడ్డికి దగ్గరి బంధువు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అయితే విజయసాయిరెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కుమార్తె అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ కారణంగా విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతాడు.

relati0n between Taraka Ratna and Vijaya Sai Reddy

relati0n between Taraka Ratna and Vijaya Sai Reddy

అలేఖ్య రెడ్డి గతంలో సినీ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ చేసింది. ఆ టైంలోనూ హీరో తారకరత్నకు ఆమె పనిచేసింది. ఈ క్రమంలోని వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమ గా మారి పెళ్లి దాకా వెళ్లారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో హైదరాబాదులోని సంఘీ టెంపుల్లో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే తారకరత్న నెంబర్ వన్ కుర్రోడు సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అంతగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి